Wednesday, May 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పశువులకు నిబంధనల ప్రకారమే అనుమతులు ఇస్తాం: ఏడి జైనోద్దిన్

పశువులకు నిబంధనల ప్రకారమే అనుమతులు ఇస్తాం: ఏడి జైనోద్దిన్

- Advertisement -

నవతెలంగాణ – డిచ్ పల్లి :  ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే పశువులకు నిబంధన ప్రకారమే అనుమతులు ఇస్తున్నామని పశు సంవర్ధక శాఖ ఏ డి జైనోద్దిన్ పేర్కొన్నారు. బుదవారం ఇందల్ వాయి మండల కేంద్రంలోని గంగారం తాండా గ్రామ పంచాయతీ పరిధిలో నిర్వహించే పశువుల వారాంతపు సంత లో  నిబంధనాల ప్రకారమే పశువులను చూస్తూ వారికి సర్టిఫికెట్లను మండల పశువైద్యాధికారి డాక్టర్ ఎస్ గంగ ప్రసాద్, డాక్టర్ బి అభిషేక్ తో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే పశువులను చూసి నిబంధన ప్రకారమే సర్టిఫికెట్ను అందజేస్తున్నా మన్నారు. ప్రతి ఒక్కరూ నిబంధనలకు లోబడే వ్యవహరించాలని వాహనాల్లో పరిమితికి మించి పశువులను తీసుకుని వెళ్లరదని సూచించారు. వాహనంలో పశువులను సరిచూసి అనుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక సిబ్బంది సిహెచ్ రాజు, ఎం తిరుపతి, మురళి, సుజాత తో పాటు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -