నవతెలంగాణ – బెజ్జంకి : ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆరోపించారు. బుధవారం మండల కేంద్రంలోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే రసమయి మండల బీజేపీ శ్రేణులతో కలిసి సందర్శించారు.ఆకాలంగా కురిసిన వర్షానికి తడిసిన వరధాన్యాన్ని పరిశీలించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడారు. రైతులు సాగు చేసిన పంట దిగుబడులను ప్రభుత్వాలు కొనుగోలు చేయడంలో వ్యవహరించిన నిర్లక్ష్యం వల్లే ఆకాలంగా కురిసిన వర్షానికి ధాన్యం తడిసిపోయ రైతాంగం నష్టపోయారని అవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని కొనుగోలు చేసి నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.అనంతరం మండల కేంద్రంలో నూతన బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. మాజీ జెడ్పీటీసీ కనగండ్ల కవిత, అయా గ్రామాల మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



