- Advertisement -
నవతెలంగాణ – ఆలేరు టౌను : ఆలేరు పట్టణంలో బుధవారం సిపిఐ మండల కమిటీ సమావేశం కార్యదర్శి చౌడబోయిన కనకయ్య అధ్యక్షతన నిర్వహించారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు చెక్క వెంకటేష్ పాల్గొని మాట్లాడుతూ.. ఐకెపి సెంటర్ దగ్గర ఉన్న ధాన్యాన్ని వేగవంతం చేయాలని వర్షాలు పడే సూచనలు ఉన్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. రైతులకు మనో ధైర్యం రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలని, రైతులకు కాంప్లెక్స్ ఎరువులు విత్తనాలు అందుబాటులో ఉంచి రైతుల నాదుకోవాలని కోరారు. మధు, ఓదయ్య, స్వామి, రాజు, ప్రవీణ్, ఆంజనేయులు, పూలమ్మ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



