”లెజెండ్తర్వాత చాలా సినిమాలు చేశాను. కానీ వాటిలో గుర్తు పెట్టుకునేవి ఓ ఆరు ఉంటాయి. ఆ జాబితాలో 'పెద్ది'లో చేసిన అప్పల సూరి నంబర్ వన్ స్థానంలో ఉంటుంది. పెద్ది ప్రేక్షకులకు గుర్తుండి పోతుంది. ఈ సినిమాతో పరిశ్రమ గట్టిగా ఊపిరి పీల్చుకుంటుంది అని జగపతి బాబు అన్నారు. రామ్ చరణ్ నటించిన రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించారు. ఈ చిత్రం జూన్ 4న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన జగపతి బాబు మీడియాతో సినిమా విశేషాలు షేర్ చేసుకున్నారు. ఇందులో అప్పలసూరి పాత్ర చాలా కొత్తగా కనిపిస్తుంది. ఈ క్రెడిట్ మొత్తం డైరెక్టర్ బుచ్చిబాబుకే దక్కుతుంది. ఆయన ఆ పాత్రను అలా ఉండాలని కోరుకున్నారు. నేషనల్ అవార్డు విన్నింగ్ మేకప్ ఆర్టిస్ట్ రషీద్‌తో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అప్పలసూరి లుక్ ని డిజైన్ చేశారు. మొదటిసారి ఆ గెటప్ వేసు కున్నప్పుడే ఈ పాత్ర అద్భుతంగా ఉంటుందని అర్థమైంది. గెటప్ విషయంలో నేను చాలా పర్టిక్యులర్‌గా ఉంటాను. ఈ సినిమా మొత్తం జగపతి బాబు కాకుండా అప్పలసూరి మాత్రమే కనిపిస్తాడు.
నాకు ఈ పాత్ర రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎమోష నల్గా, పెర్ఫార్మెన్స్ పరంగా, గెటప్ పరంగా అన్నింటిలోనూ నాకు చాలా నచ్చిన పాత్ర ఇది. రామ్ చరణ్ సినిమాలో ఈ పాత్ర చేయడం మరింత ఆనందాన్ని ఇచ్చింది. ఇందులో నాది తండ్రి పాత్ర కాదు. చాలా ప్రేమతో, అనుబంధం తో కూడిన పాత్ర చేశాను. నాకు, రామ్ చరణ్ పాత్రకు మధ్య బ్యూటీఫుల్ ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది. అప్పలసూరి పాత్రకు డబ్బింగ్ చెప్పడం కూడా ఒక ఛాలెంజ్. కానీ ప్రతి క్షణాన్ని ఆస్వాదించాను. ఆ పాత్రలో మ్యాజిక్ ఉంది. ఆ యాసలోనూ మ్యాజిక్ ఉంది. అలాంటి పాత్ర దొరికినప్పుడు నా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించాను. ఇప్పటివరకు నేను చేసిన పాత్రల్లో ‘పెద్ది’లోని అప్పలసూరి లాంటి ఎమోషన్, లుక్, డెప్త్ ఏ పాత్రలోనూ లేదు. నేను ఎందుకు ఇంత బలంగా చెబుతున్నానో మీరు సినిమా చూసినప్పుడు అర్థమవుతుంది. ఈ సినిమా చేస్తూ ప్రతి క్షణాన్ని ఆస్వాదించాను. రామ్ చరణ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన పలకరింపులోనే ఒక ఆప్యాయత ఉంటుంది. వ్యక్తిగా చాలా మంచివాడు.
మా కుటుంబం మొత్తం చరణ్ ని ఇష్టపడతారు. ఈ సినిమా కోసం ఆయన ఎంత కష్ట పడ్డారో చూసి ఆశ్చర్యపోయాను. దెబ్బలు తిన్నారు, రక్తం కారింది. ఎక్కడా డూప్ ఉపయోగించకుండా స్వయంగా చేశారు. ‘రంగస్థలం’ నుంచి చరణ్ నటుడిగా నిరంతరం ఎదుగుతూనే ఉన్నారు. ప్రతి సినిమాకు మరింత అందంగా కనిపిస్తున్నారు. ఆయనకు అలాంటి మంచి పాత్రలు వస్తున్నాయి. బుచ్చిబాబు చాలా ప్రేమగా, వినయంగా ఉంటారు. ఎప్పుడూ పాజిటివ్‌గా ఆలోచిస్తారు. ‘రంగ స్థలం’ రోజుల నుంచే నాకు ఆయన పరిచయం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయనలో కాన్ఫిడెన్స్ చాలా పెరిగింది. నిర్మాత సతీష్ కిలారు అదృష్ట వంతుడు. రామ్ చరణ్ ఎప్పుడో ఇచ్చిన మాటను గుర్తుంచుకుని ఈ సినిమా ఆయనకు చేశారు. అక్కడే ఈ సినిమా సక్సెస్ అయ్యింది. సతీష్ ఈ ప్రాజెక్ట్ కోసం ఎంతో ప్రేమతో పనిచేశారు. ఇంకొకటి ప్రస్తుతం పరిశ్రమకి ఈ సినిమా పెద్ద దిక్కులాంటి సినిమా కూడా. ప్రస్తుతం సోనీ లివ్ కోసం ‘బ్లాక్ అండ్ వైట్’ అనే భారీ వెబ్ సిరీస్ చేస్తున్నాను. చాలా పెద్ద బడ్జెట్‌తో రూపొందుతున్న ప్రాజెక్ట్ అది.
‘పెద్ది`.. పర్రిశమకి పెద్ద దిక్కులాంటి సినిమా
- Advertisement -
- Advertisement -



