సంధ్య తిరువీధుల నిర్మాణంలో తీర్థ క్రియేషన్స్ బ్యానర్‌పై పార్థసారధి కొమ్మోజు దర్శకత్వంలో రానున్న చిత్రం ‘సందిగ్ధం’. నిహాల్, ప్రియా దేశ్ పాగ్, అర్జున్ సిహెచ్, కాజల్ తివారి మెయిన్ లీడ్స్‌లో నటించగా, విలన్ రోల్ లో ‘తెర చేప` ఫేమ్ నవీన్ సంకరపు నటించారు. ఈ సినిమాని ఈనెల 29న రిలీజ్ చేయబోతున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ఈ వేడుకకి తమ్మారెడ్డి భరద్వాజ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ, ‘‘సందిగ్ధం’ అనే టైటిల్ చాలా బాగుంది. ఈ మధ్య అసలు టైటిల్స్ ఎలా ఉంటున్నాయో అందరం చూస్తున్నాం. ఈ సినిమాకి మాత్రం అచ్చమైన తెలుగులో టైటిల్ పెట్టారు. అడవుల్లో ఎంతో కష్టపడి మూవీని చేశారని టీజర్, ట్రైలర్ చూస్తేనే తెలుస్తోంది. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. ‘ఈ ప్రయాణంలో నిర్మాత, నా భార్య సంధ్య ఎంతో సహకరించారు. ప్రతీ ఒక్క ఆర్టిస్ట్ అద్భుతంగా నటించారు. మేం ఆశించిన విజయం దక్కుతుందని నమ్ముతున్నాను. చిన్న సినిమాల్ని తీయడం కంటే ప్రమోట్ చేయడం, రిలీజ్ చేయడం చాలా కష్టం. ఈనెల 29న మా చిత్రం రాబోతోంది. అందరూ ఎంజాయ్ చేసేలా మా సినిమా ఉంటుంది. మాకు ఆడి యెన్స్ నుంచి సపోర్ట్ లభిస్తుందని ఆశిస్తు న్నాను’ అని దర్శకుడు పార్ధసారథి అన్నారు. ఎడిటర్ విశ్వన్ రాజ్ మాట్లాడుతూ,’ఈ సినిమాకు పని చేయడం ఆనందంగా ఉంది. నిర్మాత సంధ్య, దర్శకుడు పార్దు ఎంతో కష్టపడి మూవీని చేశారు. అందరూ చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు. ఈ మూవీకి గౌతమ్ రవిరామ్ సంగీతాన్ని అందించారు. నందన్ కృష్ణ కెమెరామెన్‌గా పనిచేశారు.
సరికొత్త కథతో’సందిగ్ధం`
- Advertisement -
- Advertisement -



