ఎల్ఆర్ఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కొండాపూర్ లక్ష్మీకాంత్ రెడ్డి నిర్మాతగా, అనురాగ్ అధర్వ రాజు రచనా దర్శకత్వంలో ప్రారంభమైన చిత్రం 'లఫూట్ గ్యాంగ్. రామానాయుడు స్టూడియోలో పూజ కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా జరిగిన ఈ చిత్ర ప్రారంభానికి దర్శకుడు పవన్ సాధినేని, నిర్మాత బివిఎస్ రవి, హీరోలు రాజ్ తరుణ్, ఆకాష్ పూరి, అలీ, రాహుల్ విజయ్, నటి దీప్శిక, అర్చన అయ్యర్, దర్శక, నిర్మాత అనిల్ కడియాల తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నటుడు అలీ క్లాప్ కొట్టగా, దర్శకుడు పవన్ సాధినేని కెమెరా స్విచ్ ఆన్ చేశారు. హీరోలు రాజ్ తరుణ్, ఆకాష్ పూరి చేతుల మీదుగా స్క్రిప్ట్ అందించారు. రాఖి, రిత్విక్, అభినవ్, నందు, ఆంటోనీ కార్తిక్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ టాలీవుడ్ సీనియర్ నటీనటులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు అనురాగ్ మాట్లాడుతూ, ‘1990ల నాటి రోజులలో జరిగే ఒక మంచి ఎంటర్టైనింగ్ చిత్రం. ఇప్పటికీ ఆ టైం పీరియడ్ లో ఎన్నో కథలు వచ్చినప్పటికీ ఈ కథ ఖచ్చితంగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుందిఅని అన్నారు. 'అందరూ మా సినిమాను ఆశీర్వదించవలసినదిగా కోరుకుంటున్నాను అని నిర్మాత కొండాపూర్ లక్ష్మికాంత్ రెడ్డి చెప్పారు. ఎగ్జిక్యూటీవ్ నిర్మాత వెంకటేష్ అత్తిలి మాట్లాడుతూ, ‘వచ్చే నెలలో మా సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంది. 1990ల నాటి ఒక హాస్టల్ లో జరిగే కథగా ఈ చిత్రం తెరకెక్కనుంది. అల్లరి చిల్లరిగా ఉండే ఒక యువకుల గ్యాంగ్ హాస్టల్లో ఎలా ఉంటారు, అలాగే వారి హాస్టల్ లైఫ్ ఎలా ఉంటుంది అనే కథనాలతో ఈ సినిమా ఉండబోతుంది` అని తెలిపారు.
నవ్వించే ‘లఫూట్ గ్యాంగ్
- Advertisement -
- Advertisement -



