Wednesday, May 27, 2026
E-PAPER
Homeసినిమాఅందరికీ కనెక్ట్ అయ్యే 'మిస్టర్ మిడిల్ క్లాస్`

అందరికీ కనెక్ట్ అయ్యే ‘మిస్టర్ మిడిల్ క్లాస్`

- Advertisement -

శ్రీకాంత్, లయ జంటగా, రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మిస్టర్ మిడిల్ క్లాస్. జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో జీకే & సిఎన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టీజర్ ని బుధవారం లాంచ్ చేశారు. ప్రముఖ దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి ఈ వేడుకలో ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ,' కమలాకర్ ఫోన్ చేసి ఒక మంచి ఎంటర్‌టైనర్ చేద్దామని చెప్పారు. నాగేశ్వర్ రెడ్డి దర్శకుడు అని తెలిసిన తర్వాత నా కాన్ఫిడెన్స్ మరింత పెరిగింది. మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే సినిమా చేసి చాలా రోజులైంది. చాలా కాలం తర్వాత అలాంటి చక్కని సినిమా చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ సినిమాలో వెంకటేశ్వర స్వామి పాత్రను రాజేంద్రప్రసాద్ ఎంతో నిజా యితీగా, అంకితభావంతో పోషిం చారు. లయతో ఎన్నో మంచి సినిమాలు చేశాను అని తెలిపారు. ‘దర్శకుడు నాగేశ్వర్ రెడ్డి కథ చెప్పినప్పుడు నాకు చాలా నచ్చింది. కథ వింటూనే నవ్వుకుంటూ ఉన్నాను. సినిమా చాలా హిలేరి యస్‌గా ఉంటుందిఅని హీరోయిన్ లయ చెప్పారు. దర్శకుడు జి. నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, 'శ్రీకాంత్ కి ఇది ఒక గొప్ప కమ్‌బ్యాక్ సినిమా అవుతుంది. టెక్నీషియన్లు, ఆర్టిస్టులు అందరూ సహకరించడంతో సినిమా అద్భుతంగా వచ్చింది. ఇది భారతదేశంలోని ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే కథ. ఇందులో కర్మ ఫలితం గురించి చెప్పాం. ప్రతి సన్నివేశాన్ని నవ్వుతూ ఆస్వాదించేలా ఉంటుంది అని తెలిపారు. ‘నాగేశ్వర్ రెడ్డి కథ చెప్పగానే మాకు చాలా నచ్చింది. చాలా ఫ్రెండ్లీగా, పాజిటివ్ వాతావరణంలో ఈ సినిమాను పూర్తి చేశాం. నాగేశ్వర్ రెడ్డి సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. శ్రీకాంత్, లయ నటన ప్రేక్షకులను ఆకట్టు కుంటుంది` అని నిర్మాత చందూ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -