ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ధీరజ్ మొగిలినేని 'సమ్మర్ హాలిడేస్ అనే చిల్డ్రన్ మూవీని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. దీనికి దర్శకుడు శ్రీకర్. మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబి ఖుషి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బుధ వారం జరిగిన ఈ చిత్ర టీజర్ లాంచ్ వేడుకకి నిర్మాత దిల్ రాజు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ, ‘ధీరజ్..తనదైన దారి వేసు కుంటూ ఈ రోజు హిట్స్ మీద హిట్స్ అందుకున్నాడు. మనకు చిల్డ్రన్ ఫిలిం వచ్చి చాలా కాలమవుతోంది. పిల్లలతో చేసిన ఈ సినిమా ఈ సమ్మర్ లో అందరినీ ఎంటర్ టైన్ చేయాలిఅని అన్నారు. 'జీవితంలోని చిన్న చిన్న సందర్భాలు, విషయాలను అందంగా తెరకెక్కించిన చిత్రమిది అని నటి వాసుకి చెప్పారు. డైరెక్టర్ శ్రీకర్ మాట్లాడుతూ,’స్క్రిప్ట్ మీద ఉన్న నమ్మకంతో పాటు ధీరజ్ ఉన్నారనే ధైర్యం ముందుకు నడిపించిందిఅని తెలిపారు. 'నేను, ధీరజ్ మంచి ఫ్రెండ్స్. 'దేవర, డాకూ మహరాజ్వంటి మూవీస్ డిస్ట్రిబ్యూట్ చేశాం. సినిమా బాగా వచ్చింది. మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాంఅని ప్రొడ్యూసర్ గిరిబాబు చెప్పారు. ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ,'సూపర్బ్ కంటెంట్ తో వస్తున్నామనే గర్వంగా ఉన్నాను. నేను చిన్నప్పుడు 'లిటిల్ సోల్జర్స్ లాంటి మూవీ చూసి ఎంజాయ్ చేశాను. ఇలాంటి జానర్ లో ఏడాదికి ఒక సినిమా వచ్చినా పిల్లలు, ఫ్యామిలీస్ థియేటర్స్ కు వెళ్లి ఎంజాయ్ చేస్తారని నమ్మాను` అని తెలిపారు.
‘పరిశ్రమ ప్రస్తుతం చాలా కష్టకాలంలో ఉందని చెప్పడానికి నేనేమీ భయపడను. ప్రేక్షకులను థియేటర్లకు తీసుకురావడమే ఇప్పుడు పెద్ద సవాల్. చిన్న సినిమాలతో దర్శకులందరూ మంచి పేరు తెచ్చుకుంటున్నారు. కొత్త దర్శకులందరూ మంచి చిత్రాలు తీసి, పరిశ్రమని నిలబెట్టండి. చిన్న సినిమాలు ఎంత విజయం సాధిస్తే పరిశ్రమ అంత బాగుంటుంది`.
దిల్ రాజు



