నేడు రాష్ట్ర, జిల్లా కేంద్రాల్లో నిరసనలు : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేరళ మాజీ ముఖ్యమంత్రి, సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యుడు పినరయి విజయన్ ఇండ్లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేపట్టిన దాడులను సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ఖండించారు. ఇదే విషయంపై గురువారం రాష్ట్ర, జిల్లా కేంద్రాల్లో నిరసనలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో ఉదయం 10:30 గంటలకు జరిగే నిరసన కార్యక్రమంలో సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు పాల్గొంటారని తెలిపారు. జిల్లా, రాష్ట్ర కేంద్రాల్లో జరిగే నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలని పార్టీ శ్రేణులకు జాన్‌వెస్లీ పిలుపునిచ్చారు.
ఈడీ దాడులను ఖండిస్తున్నాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



