Thursday, May 28, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంముస్లిం సోదరులకు బక్రీద్‌ పండుగ శుభాకాంక్ష‍లు:సీఎం

ముస్లిం సోదరులకు బక్రీద్‌ పండుగ శుభాకాంక్ష‍లు:సీఎం

- Advertisement -

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
త్యాగనిరతి, దైవభక్తికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ (ఈద్ ఉల్ అజ్హా) పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌‌రెడ్డి ముస్లిం సోదర సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. త్యాగం చేయడానికి సిద్ధపడిన గొప్ప సంఘటనను స్మరిస్తూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఈ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారని సీఎం గుర్తు చేశారు. బక్రీద్ పండుగ మనిషికి త్యాగం, దాతృత్వం, విశ్వాసం, మానవత్వం వంటి గొప్ప విలువలను గుర్తుచేస్తుందని అన్నారు. జీవితంలో ఎలాంటి కష్టాలు ఎదురైనా దేవుడిపై నమ్మకంతో సన్మార్గంలో ముందుకు సాగాలనే సందేశాన్ని ఈ పండుగ అందిస్తోందని తెలిపారు. తమకు ఉన్నదాంట్లో కొంతైనా అవసరమైన వారికి పంచిపెట్టడం కన్నా గొప్ప దానం మరొకటి లేదనే స్ఫూర్తిని బక్రీద్ ప్రపంచానికి చాటిచెబుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -