Thursday, May 28, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం2021 పేస్కేల్ సర్క్యులర్‌‌ను సవరించాలి

2021 పేస్కేల్ సర్క్యులర్‌‌ను సవరించాలి

- Advertisement -

ఆర్టీసీ ఎండీకి ఎస్‌‌డబ్ల్యూఎఫ్‌ వినతి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యంతో జరిగిన చర్చల ఒప్పందంలో భాగంగా 2021 పేస్కేల్ సర్క్యులర్‌‌ను సవరించాలని టీజీఎస్‌ ఆర్టీసీ స్టాఫ్‌ అండ్‌ ‌వర్కర్స్‌ ‌ఫెడరేషన్‌(‌ఎస్‌‌డబ్ల్యూఎఫ్‌) ‌ఆర్టీసీ యాజమాన్యానికి విజ్ఞప్తి చేసింది. ఈమేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష‍ులు వీరాంజనే యులు, ప్రధానకార్యదర్శి విఎస్‌ ‌రావు సంయుక్తంగా ఎండీ వై.నాగిరెడ్డికి వినతిపత్రం అందజేశారు. గతంలో జూన్‌ జీతంలో అమలు చేస్తూ సర్క్యూలర్ ఇచ్చినందుకు దన్యవాదాలు తెలియజేశారు. ఆ సందర్భంగా తలెత్తిన లోపాలను సవరించి కొత్తగా ఉత్తర్వులను జారీచేయాలని విజ్ఞప్తి చేశారు. ఆ సర్క్యులర్‌‌ను సవరించాలని కోరుతూ ఈ లేఖ ద్వారా ఆర్టీసీ ఎండీ దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలియజేశారు. సమస్యలు..పరిష్కారాలు​1, ఆర్. పి.ఎస్-2017లో కొన్ని స్లాబ్స్ జూనియర్స్, సీనియర్స్ ఒకే స్కేలులో ఫిక్స్ చేశారనీ, వివిధ కేటగిరిల్లో 19 చోట్ల అలా జరిగిందనీ, దీనివల్ల సీనియర్స్ కు లాభం లేకుండా పోయిందని దానిని సరిచేయాలని ఇప్పటికే కోరాం. ఈ సమస్య ఆర్పిఎస్- 2021లో మరింతగా పెరిగిపోయింది. డ్రైవర్ గ్రేడ్ – 2 క్యాడర్లోని ఆర్పిఎస్ – 2017లోని రూ. 31,500 బేసిక్ పే, రూ. 32,270 బేసిక్ పే వున్న వారు ఇద్దరిది రూ.

42,980 వద్దే ఫిక్సేషన్ అవుతుంది. అలాగే రూ.37,840, రూ.38,640 వద్ద వున్నవారు రూ.51,510 వద్ద, రూ. 40,270, రూ.41,100, బేసిక్ పే ఉన్న వారురూ. 55,320 వద్ద, రూ.43,590, రూ.44,420 ఉన్న వారు రూ.59,400 వద్ద, రూ.47,800, రూ.48,660 బేసిక్ ఉన్న వారు రూ.64.940 వద్ద, రూ.52,100, రూ. 52,960 బేసిక్ పే వున్న వారు ఇద్దరిది రూ.70,780 వద్దనే ఫిక్స్ చేస్తారు. మొత్తం డ్రైవర్ గ్రేడ్ 2లో 22 స్లాబుల్లో ఈ పరిస్థితి వుంది.‘ఇదే పరిస్థితి జూనియర్ అసిస్టెంటుతో పాటు ఇతర అన్ని క్యాటగిరీలలోనూ వుంది. ఈ పే ఎనామలీస్ ను సరి చేసి స్కేల్స్ చేయాలని మేము కోరినప్పటికీ ఆ సమస్య మరింత తీవ్రమయ్యేలా చేయడం బాధాకరం. దానిని సరి చేయాలని’ కోరుతున్నాము.2. ఇంక్రిమెంటు రేట్‌ : ఇంక్రిమెట్లు రేట్లు అన్ని స్థాయిల్లో ఐదు శాతం వుండాలని కోరగా పాత పద్ధతిలోనే, అంటే పర్సంటేజ్లో చూసినప్పుడు 3.12 శాతం నుంచి 3.82 శాతం వుండగా చివరి స్లాబులు 1.95 శాతం నుంచి 2.05 శాతం మాత్రమే వున్నాయి. కనీసం అన్ని స్థాయిల్లోను ప్రారంభంలో వున్న రేట్లతోనే చివరి వరకు ఉండేలా చూడగలరని కోరుతున్నాము.3. డిప్యూటీ సూపరింటెండెంట్ (ట్రాపిక్) కంటే టిఐ-3/డిసి/టిటిఐ/డిఐ లు కింది స్థాయిలో వుంటారు.

కానీ టిఐ3 క్యాడర్లో రూ. 62690 స్కేలు వద్ద ఇంక్రిమెంటు రేటు రూ.1550 లుగా వుండగా డిప్యూటీ సూపరింటెండెంట్ (ట్రాఫిక్) స్కేలు రూ. 60,510 నుండి రూ.69,510 మధ్య ఇంక్రిమెంటు రేట్‌ రూ.1500 లు వుండటంతో ఒకే స్థాయి జీతంలో కూడా డిప్యూటీ సూపరింటెండెంట్ (ట్రాఫిక్) రూ.50 తక్కువగా ఇంక్రిమెంటు పొందుతున్నారు. దీనిని సరి చేయాలి.4. స్కేల్స్ లో ఇంక్రిమెంటు స్పాన్ 8 సంవత్సరాల స్థానంలో మూడేండ్లు వుండాలని కోరగా కేవలం ఆరేండ్లుగా మాత్రమే నిర్ణయించారు. దీనిని ఆర్టీసీ ఒప్పందాల కాలం అయిన నాలుగేండ్లుగా మార్చాలని కోరుతున్నాము.5. సిసిఏ అమలు : సిటీ కంపెన్సటరీ అలవెన్స్ (సిసిఏ) ప్రభుత్వ విధానమే అమలు చేస్తారు. కాబట్టి ఇక్కడ పాత సిసిఏ రేట్లనే కొనసాగిస్తున్నారని భావిస్తున్నాము. అయితే 2021-2026 మధ్యలో అనేక మున్సిపాల్టీలు, మున్సిపల్ కార్పొరేషన్లుగా అప్‌‌గ్రేడ్‌ అయ్యాఇ. అందుకని అప్‌‌గ్రేడ్‌ అయిన మున్సిపల్ కార్పొరేషన్లల్లో సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్ ను అమలు చేసేలా చూడాలని కోరుతున్నాం,6. ఇంటి అద్దె అలవెన్స్ : ఇటీవలి కాలంలో మున్సిపాల్టీల నుంచి మున్సిపల్ కార్పొరేషన్లుగా అప్‌‌గ్రేడ్‌ అయిన నగరాలలోని డిపో కార్మికులకు ఇంటి అద్దె అలవెన్స్ను సరి చేయాలని కోరుతున్నాం.7. టైపిస్టులకు స్పెషల్ పే : ప్రస్తుతం మన సంస్థలో టైపిస్టులు అతి తక్కువగానే వున్నారు. స్పెషల్ పే ని స్కేల్లో మెర్జ్‌ చేయాలన్న చిరకాల కోర్కే అలాగే మిగిలిపోయింది. అందుకని వారి స్పెషల్ పే ని బేసిక్ పేలో కలిపేలా నిర్ణయం చేయాల్సిందిగా కోరుతున్నాం. 8. గ్రేడ్ పే : ఆర్పిఎస్-2021 నుంచి 2026 జూన్ నెల జీతంలో అమలు చేస్తున్నారు.

ఆర్పిఎస్-2025 ఇంకా బాకీ వున్నది. అలాగే ప్రభుత్వం అంగీకరించినట్టు ఆర్టీసి కార్మికులను ప్రభుత్వోద్యోగులుగా విలీనం చేసే క్రమంలో ఆర్టీసి కార్మికులకు అమలులో వున్న గ్రేడ్ పేలను కొనసాగించకపోవచ్చు.కానీ ఆర్పిఎస్ – 2021లోనే గ్రేడ్ పేలను బేసిక్పే లో మెర్జ్ చేస్తూ సూచిక -3లోని సర్క్యులర్ ఇచ్చారు. దీనివల్ల డిప్యూటీ సూపరిటెండెంట్ నుంచి పై క్యాడర్లో వున్న ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారు. విలీన ప్రక్రియ జరిగే వరకు ‘గ్రేడ్ పే’ లను యధావిధంగా కొనసాగిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతున్నాము.9. ఆర్పిఎస్ – 2017, ఆర్పిఎస్ 2021 పరిధిలో రిటైరైన వారి చెల్లింపులు.ఆర్పిఎస్ – 2017 , ఆర్పిఎస్ -2021ల ఒప్పందం అమలు కాలంలో రిటైరైన ఉద్యోగ, కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలపై ఎటువంటి స్పష్టత సూచిక-3లోని సర్క్యులర్ లో లేదు. దీనిపై వెంటనే స్పష్టత ఇవ్వాలి.10. స్టాగ్నేషన్ ప్రమోషన్స్ స్థానంలో ఆటోమెటిక్ అడ్వాన్స్మెంటు స్కీంను అమలు చేయడం : ప్రస్తుతం ఆర్టీసిలో 12 నుంచి 20 సంవత్సరాలలో స్టాగ్నేషన్ స్కేల్ను అమలు చేస్తున్నారు. ఆ స్థానంలో 6-12-18-24-30 సం॥ల ఆటోమేటిక్ అడ్వాన్స్మెంటు (ఏఏఎస్) ను అమలు చేయాలని కోరుతున్నాం.11. అలవెన్స్ లు : 21.05.2026న ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కమిటీ కీ కార్మిక సంఘాల నాయకుల మధ్య జరిగిన చర్చలలో అంగీకరించినట్టు ఎస్ – 2013లోని అలవెన్స్ లు అన్నింటిని 80 శాతం పెంచుతూ తక్షణమే ఉత్తర్వులు ఇచ్చి, కార్మికులు ఇంకా నష్టపోకుండా చూడాలని కోరుతున్నాం.​

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -