పాలకుర్తి బస్టాండ్ సమీపంలో ఘటణ
దాడిలో గాయపడిన శాతాపురం వాసి
గాయాలతో దుండగులను ప్రతిఘటించిన బాధితుడు
మెరుగైన వైద్యం కోసం వరంగల్ కు తరలింపు
నవతెలంగాణ-పాలకుర్తి
పాలకుర్తి బస్టాండ్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు శాతాపురం గ్రామానికి చెందిన తీగల ధర్మారావు పై కత్తులతో దాడికి పాల్పడడంతో తీవ్రంగా గాయపడిన సంఘటన బుధవారం మండల కేంద్రంలో గల బస్టాండ్ సమీపంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పాలకుర్తి మండలం శాతాపురం గ్రామానికి చెందిన తీగల ధర్మారావు వృత్తిరీత్యా స్టేషన్ ఘన్పూర్ మండల కేంద్రంలో కుటుంబంతో కలిసి మినీ బ్యాంకును నిర్వహిస్తూ పాలకుర్తిలో నివాసముంటున్నాడని తెలిపారు. భోజన అనంతరం రాత్రి 9 గంటల సమయంలో వాకింగ్ కు వెళ్లిన ధర్మారావును గుర్తుతెలియని వ్యక్తులు కారులో వచ్చి కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని తెలిపారు. దాడికి పాల్పడిన వ్యక్తులు ధర్మారావును వీపులో, కడుపులో అరచేతికి, చేయి పై కత్తిపోట్లు పొడవడంతో దుండగులను ధర్మారావు తీవ్రంగా ప్రతిఘటించి వెంబడించాడని తెలిపారు. ధర్మారావు గొంతు కోసి హత్య చేసేందుకు దుండగులు యత్నించడంతో ధర్మారావు వారిని తీవ్రంగా ప్రతిఘటించారు. కత్తిపోట్లకు గురైన ధర్మారావుకు తీవ్రంగా రక్తస్రావం కావడంతో పాలకుర్తిలో గల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హన్మకొండకు తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ధర్మారావును పాలకుర్తి సీఐ వంగాల జానకిరామ్ రెడ్డి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అన్నదమ్ముల మధ్య భూతగాదాలతో పాటు ఆస్తి తగాదాలు ఉన్నాయని ధర్మారావు వివరించారని తెలిసింది. కత్తులతో దాడికి పాల్పడింది ఎవరో గుర్తుపట్టలేదని సిఐ కి వివరించినట్లు సమాచారం. దుండగుల ఆచూకీ కోసం పాలకుర్తి ఎస్సై దూలం పవన్ కుమార్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది విస్తృతంగా గాలిస్తున్నారు. కత్తులతో దాడి విషయంపై పోలీసులను వివరణ కోరగా ఇలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.
కత్తులతో గుర్తు తెలియని వ్యక్తులు దాడి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



