Wednesday, May 27, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమహారాష్ట్ర సీఎంకు రేవంత్‌రెడ్డి లేఖ

మహారాష్ట్ర సీఎంకు రేవంత్‌రెడ్డి లేఖ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : తుమ్మిడిహట్టి బ్యారేజీపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్‌కు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి లేఖ రాశారు. దీనిపై మహారాష్ట్రతో చర్చించేందుకు సిద్ధమని అందులో పేర్కొన్నారు. తెలంగాణ ప్రతినిధులకు సమయం ఇవ్వాలని.. భేటీకి తేదీ ఖరారు చేయాలని కోరారు. గతంలో 148 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్‌కు (ఫుల్‌ రిజర్వాయర్‌ లెవల్‌) మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. దీని వల్ల ఉత్తర తెలంగాణ నీటి అవసరాలు తీరవని చెప్పారు. ఎఫ్‌ఆర్‌ఎల్‌ పెరిగితే గ్రావిటీ ద్వారా తెలంగాణకు నీళ్లొస్తాయని వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -