Thursday, May 28, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరెవెన్యూలో అక్రమ పదోన్నతులు

రెవెన్యూలో అక్రమ పదోన్నతులు

- Advertisement -

డీఆర్‌‌వో, ఎస్‌‌డీసీలుగా తహశీల్దార్లకు బాధ్యతలు
సర్కారు నిర్ణయంపై సర్వత్రా విమర్శలు..12 మంది తహశీల్దార్ల బదిలీ

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రెవెన్యూ శాఖ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. గతంలో ఇలాంటి నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ తీసుకోకపోవడం గమనార్హం. డిపార్ట్‌‌మెంట్‌ ‌ప్రమోషన్‌ ‌కమిటీ (డీపీసీ) నిర్ణయం ప్రకారం తహశీల్దార్లకు ఎలాంటి పదోన్నతులు ఇవ్వలేదు. కానీ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ (ఎస్‌‌డీసీ), జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్‌‌వో) పోస్టులను తహసీల్దార్లకు అప్పగించడం వివాదాస్పదమైంది. అయితే తహశీల్దార్లకు ఆయా పోస్టులు సమానమైనవి కూడా కాదు. కానీ వారికి ఆ బాధ్యతలు అప్పగించడంలో ఆంతర్యమేంటన్న ప్రశ్న తలెత్తుతున్నది. ఆ తహశీల్దార్లపైనే ప్రభుత్వానికి అంత శ్రద్ధ ఎందుకన్న చర్చ జరుగుతున్నది. ఆ తహశీల్దార్ల నుంచి రెవెన్యూ శాఖ ఉన్నతాధికా రులకు ఏమైనా ముడుపులు అందాయా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనల కు యధేచ్చగా తిలోదకాలు ఇచ్చారన్న విమర్శలు వస్తున్నాయి. రెవెన్యూ శాఖలో గతంలో ఇలాంటి నిర్ణయాలు జరగలేదని ఇతర తహశీల్దార్లు కూడా వాపోతున్నారు. దీన్ని బట్టి రెవెన్యూ శాఖలో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు జరుగుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నా యి. ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోం, అంతా మా ఇష్టం అన్నట్టుగా రెవెన్యూ శాఖ ఉన్నతాధికారుల తీరు ఇప్పుడు హాట్‌‌టాపిక్‌‌గా మారింది. రాష్ట్రంలో భారీగా తహసీల్దార్లు (ఎమ్మార్వోలు) బదిలీలు జరిగాయి.

12 మంది తహసీల్దార్లను బదిలీ చేస్తూ రెవెన్యూ శాఖ కార్యదర్శి డీఎస్ లోకేశ్‌ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలనా అవసరాల దృష్ట్యా ఈ బదిలీలు జరిగాయని‌ తెలిపారు. అయితే తాత్కాలిక ప్రాతిపదికన పోస్టింగ్‌‌లను ఇచ్చామని పేర్కొన్నారు. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. నిర్మల్‌‌లో పనిచేస్తున్న ఏ మోతీరాంను మంచిర్యాల డీఆర్‌‌వోగా, కరీంనగర్‌లో పనిచేస్తున్న బి రాజేశ్వరిని పెద్దపల్లి డీఆర్‌‌వోగా, పెద్దపల్లిలో పనిచేస్తున్న కెవై ప్రసాద్‌ను జగిత్యాల డీఆర్‌‌వోగా, వనపర్తిలో పనిచేస్తున్న ఆర్ పాండును నాగర్‌కర్నూల్ డీఆర్‌‌వోగా, ఖమ్మంలో పనిచేస్తున్న వి రవి కుమార్‌ను ములుగు డీఆర్‌‌వోగా, మేడ్చల్-మల్కాజిగిరిలో పనిచేస్తున్న జె స్వామిని కరీంనగర్ డీఆర్‌‌వోగా నాగర్‌కర్నూల్‌లో పనిచేస్తున్న ఎ పాండును కామారెడ్డి డీఆర్‌‌వోగా బదిలీ చేశామని వివరించారు. జనగామలో పనిచేస్తున్న సీహెచ్ శ్రీకాంత్‌ను మహబూబ్‌నగర్ స్పెషల్ కలెక్టర్ పీఏగా నియామించామని పేర్కొన్నారు. సూర్యా పేటలో పనిచేస్తున్న ఎం సుదర్శన్ రెడ్డిని సిద్ధిపే ట ఎస్‌డీసీ (ఎల్‌ఏ)గా, ఖమ్మంలో పనిచేస్తున్న ఎం రమాదేవిని నల్లగొండ ఎస్‌డీసీ (ఎల్‌ఏ)గా, పెద్దపల్లిలో పనిచేస్తున్న జి కుమా రస్వామిని సిరిసిల్ల ఎస్‌డీసీ (ఎల్‌ఏ)గా, కరీంన గర్‌‌లో పనిచేస్తున్న ఎన్ వెంకట్ రెడ్డిని కరీంనగర్ ఎస్‌డీసీ (ఎల్‌ఏ)గా బదిలీ చేశామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -