- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో, కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ సూపర్ ట్విస్ట్ ఇచ్చారు. సీఎం పదవికి సిద్ధరామయ్య గురువారం రాజీనామా చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి కార్యాలయం గురువారం ఉదయం 10.30 గంటలకు గవర్నర్ అపాయింట్మెంట్ కోరింది. అయితే గవర్నర్ తన కుటుంబంతో కలిసి స్వస్థలమైన ముంబైకి వెళ్లినట్టు తెలుస్తోంది. ఆయన ఎప్పుడు తిరిగి వస్తారనే విషయంలో కూడా క్లారిటీ లేదు. ఎందుకంటే ఆయన తిరుగు ప్రయాణానికి సంబంధించిన టికెట్ ఇంకా బుక్ అవలేదని సమాచారం .
- Advertisement -



