- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టులో అత్యంత కీలకమైన ‘తుమ్మిడిహెట్టి బ్యారేజ్’ నిర్మాణం , దాని ఎత్తుపై మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు తెలంగాణ ప్రభుత్వం అడుగు ముందుకేసింది. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, మహారాష్ట్ర ముఖ్యమంత్రికి అధికారికంగా ఒక లేఖ రాశారు. ఈ బ్యారేజ్ అంశంపై చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రతినిధుల బృందంతో ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని, అందుకు అనుకూలమైన తేదీని త్వరగా ఖరారు చేయాలని రేవంత్ రెడ్డి ఆ లేఖలో కోరారు.
- Advertisement -



