Thursday, May 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ముస్లిం సోదరులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన సర్పంచ్

ముస్లిం సోదరులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ : ఈద్ అల్-అధా (బక్రీద్) పర్వదినం సందర్భంగా ముస్లిం సోదర, సోదరీమణులందరికీ హార్దిక శుభాకాంక్షలు తెలిపిన మద్నూర్ గ్రామం సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి, ఉపసర్పంచ్ వట్నాల రమేష్. బక్రీద్ పండుగ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులు కొత్త బస్టాండ్ సమీపంలోని ఈద్గా మైదానంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం హిందూ సోదరులను కలిసి అలై బలై చేసుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. గ్రామపంచాయతీ ఆవరణంలో గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు ముస్లిం సోదరులను కలిశారు. కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు జావిద్ పటేల్ కు అలై బలై చేసుకుంటూ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. త్యాగం, ప్రేమ, దయ, సహనం అనే మహత్తర విలువలను గుర్తు చేసే ఈ పవిత్ర పర్వదినం ప్రతి ఇంటిలో ఆనందం, శాంతి, ఐక్యతను నింపాలని ఆకాంక్షించారు. భగవంతుడి కరుణాకటాక్షాలు అందరిపై ఉండాలని, ప్రతి ఒక్కరి జీవితంలో ఆరోగ్యం, సంతోషం, అభివృద్ధి కలగాలని ఆకాంక్షించారు. ఈ శుభాకాంక్షలు కార్యక్రమంలో సంఘయప్ప, రవి, శివాజీ, సాహెబ్ రావు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -