Thursday, May 28, 2026
E-PAPER
Homeఆదిలాబాద్ జన్నారంలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు

 జన్నారంలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు

- Advertisement -

 నవతెలంగాణ – జన్నారం : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు 103వ జయంతి సందర్భంగా గురువారం జన్నారం మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు. అనంతరం ప్రభుత్వాసుపత్రిలోని రోగులకు పండు బ్రెడ్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. సందర్భంగా టిడిపి ఆదిలాబాద్ పార్లమెంటరీ అర్హ కమిటీ సభ్యులు పులిశెట్టి  శ్రీనివాస్ మాట్లాడుతూ.. నందమూరి తారక రామారావు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసమే పార్టీని స్థాపించి వారికి ఎన్నో సంక్షేమ పథకాలను అందించాలన్నారు. పేదవాడికి రెండు రూపాయల కిలో బియ్యం అందించి, పేదవాడి కడుపు నింపిన మహానీయుడు అన్నారు. పటేల్ పట్వారి వ్యవస్థను రద్దుచేసి మండల వ్యవస్థను తయారుచేసిన మహానుభావుడు  ఎన్టీఆర్ అన్నారు.  తెలియజేయంతి సందర్భంగా మహానాడు ను ఆ పార్టీ అధ్యక్షులు నందమూరి తారక రామారావు లోకేష్ లు ఘనంగా నిర్వహిస్తున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సూచించారు ఈ కార్యక్రమంలో, మండల ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి ప్రసాద్,  టిడిపి మండల ఉపాధ్యక్షులు గంధం పద్మారావు, మండల తెలుగు యువత అధ్యక్షులు ముత్యం, పెళ్లి నవీన్,  తెలుగు యువత, యువ నాయకులు, పులిశెట్టి చంద్రమౌళి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -