Thursday, May 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎడ్లపల్లి అదర్శ పాఠశాలలో దరఖాస్తుల స్వీకరణ..!

ఎడ్లపల్లి అదర్శ పాఠశాలలో దరఖాస్తుల స్వీకరణ..!

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు : ఇంగ్లిష్ మీడియంలో 6 నుంచి ఇంటర్మీడియట్ వరకు చదవాలనుకునే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు తెలంగాణ మోడల్ స్కూళ్లు ఓ వరంలా మారాయని, మోడల్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, కళలు, సాంస్కృతిక రంగాల్లో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి లో ప్రతిభ కనబరుస్తున్నారని, ఫలితాల్లో టాప్ ర్యాంక్లు సాధిస్తున్నారు. ఇంటర్ ఫలితాల్లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారని, నేషనల్ కం మెరిట్ స్కాలర్ షిప్, పాలిసెట్, జేఈఈ మెయిన్స్ సీట్లు సైతం కైవసం చేసుకోవడంతో పదో తరగతి ఉత్తీర్ణులైన బాలబాలికల తల్లిదండ్రులు ఆదర్శ పాఠశాలలకే మొగ్గు చూపుతున్నారనీ, 2026-27 విద్య సంవత్సరానికి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్టుగా మండలం ఎడ్లపల్లి గ్రామ మోడల్ స్కూల్ ప్రిన్స్ పల్ పూర్ణచందర్ రావు గురువారం తెలిపారు.ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ 6వ తరగతిలో 100 సీట్లు,7వ తరగతిలో 70 సీట్లు, 8వ తరగతిలో 64 సీట్లు, 9వ తరగతిలో 60 సీట్లు అలాగే ఇంటర్మీడియట్ లో సీఈసీ, ఎంపీసీ, బైపీసీ, ఏఈసి గ్రూపుల్లో ఒక్కొక్క గ్రూపుకు 40 చొప్పున మొత్తం 160 సీట్లు ఖాళీగా అందుబాటులో ఉన్నాయి.

ఈ సీట్లను భర్తీ చేసేందుకు పదో తరగతిలో ఉత్తీర్ణులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి మెరిట్ ఆధారంగా రోస్టర్ ప్రకారం విద్యార్థులను ఎంపిక చేయనున్నారు.100 మంది బాలికలకు హాస్టల్ వసతి సైతం కల్పించనున్నారు. చుట్టు పక్కల గ్రామాల్లో కాకుండా దూర ప్రాంతాల నుంచి వచ్చే 9,10, ఇంటర్ చదివే బాలికలకు భోజనం వసతి ఉందని తెలిపారు.ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ఎంపిసి 40 సీట్లు, బైపిసి 40 సీట్లు,సిఇసి 40 సీట్లు,ఏఈసి 40 సీటుకు మొత్తం 160 సీట్లు, రెండవ సంవత్సరం ఎంపిసి 20 సీట్లు, బైపిసి 20 సీట్లు, సిఈసి 20 సీట్లు మొత్తం 60 సీట్లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు ఉచిత విద్యతో పాటు వసతి, పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫాం, కంప్యూ టర్ విద్య, ఐఎఫ్పీ డిజిటల్ బోర్డులతో అనుభవ జ్ఞులైన ఉపాధ్యాయులతో విద్యను అందిస్తారని పూర్తి వివరాలకు 9032368994 ఫోన్ నెంబర్ సంప్రదించాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -