- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్ : బక్రీద్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని వేడుకలకు హాజరు కావాలని కాంగ్రెస్ పార్టీ మండల మైనారిటీ అధ్యక్షులు జావిద్ పటేల్ ఆహ్వానించారు. ఈ మేరకు ఆయన ఇంటికి వెళ్లి బక్రీద్ పండుగ వేడుకల్లో పాల్గొని కురుసుంబ స్వీట్ లను స్వీకరించిన మండల మాజీ ఎంపీపీ ప్రజ్ఞకుమార్, మద్నూర్ మాజీ ఎంపీటీసీలు కరేవార్ రాములు, సంగీత కుశాల్, గ్రామపంచాయతీ మైనార్టీ వార్డు సభ్యులు హనుమాన్లు కాంగ్రెస్ నాయకులు సంఘయప్ప పాల్గొన్నారు. వీరందరికీ మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు జావీద్ పటేల్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు నాయకులు ఇంటికి వెళ్లి ఆయనకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జావిద్ పటేల్ సోదరుడు పాల్గొన్నారు.
- Advertisement -



