- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : కేరళలోని తిరువనంతపురంలో గురువారం మధ్యాహ్నం హ్యాపీలాండ్ వాటర్ థీమ్ అండ్ అమ్యూజ్మెంట్ పార్క్లో భారీ జెయింట్ వీల్ కూలిపోవడంతో ఏడుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో రైడ్ చేస్తున్నప్పుడు జెయింట్ వీల్ విరిగి కింద పడిపోయింది. గాయపడిన వారిని గోకులం మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు, వీరిలో కొందరికి ఎముకలు విరిగినట్లు సమాచారం. పోలీసులు పార్క్ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు, జెయింట్ వీల్ సపోర్ట్ స్టాండ్ విరిగిపోవడమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక విచారణలో తేలింది.
- Advertisement -



