శ్రీలంక కమ్యూనిస్ట్ పార్టీ
కొలంబో: సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు, కేరళం మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నివాసంపై ఈడీ రాజకీయ ప్రేరేపితంగా జరిపిన దాడిని శ్రీలంక కమ్యూనిస్టు పార్టీ తీవ్రంగా ఖండించింది. మితవాద శక్తుల రాజకీయ కక్ష సాధింపు చర్యలను ఎదుర్కొంటున్న పినరయి విజయన్, సీపీఐ(ఎం), కేరళంలోని కార్మిక, రైతాంగ ప్రజలకు సంఘీభావం తెలిపింది. ఈ మేరకు శ్రీలంక కమ్యూనిస్టు పార్టీ అంతర్జాతీయ విభాగం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. కేరళంలోని కార్మికులు, రైతులు, అణగారిన వర్గాల హక్కుల కోసం రాజీలేని పోరాటం చేసిన ప్రజానాయకుడు పినరయి విజయన్ అని తెలిపింది. కేరళంలో అధికారంలో ఉన్న లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ ప్రభుత్వాలు ప్రజా ప్రత్యామ్నాయం సాధ్యమేనని ప్రపంచానికి నిరూపించాయని పేర్కొంది. కానీ మితవాద శక్తులు ఈ ప్రజా ప్రత్యామ్నాయాన్ని అసహనంతో చూస్తున్నాయని వివరించింది. కేంద్ర ఏజెన్సీలను ఉపయోగించి చేస్తున్న ఈ వేట దానికి ప్రతిబింబమేనని తెలిపింది. ఇలాంటి వేధింపుల ద్వారా వామపక్షాల గొంతు నొక్కలేరని శ్రీలంక కమ్యూనిస్టు పార్టీ స్పష్టం చేసింది. సంక్షోభాలను అధిగమించడం ద్వారా కేరళంలో ఎర్ర జెండా మరింత ఎత్తుకు ఎగురుతుందని పేర్కొంది.
వేధింపులతో వామపక్షాల గొంతు నొక్కలేరు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



