Friday, May 29, 2026
E-PAPER
Homeవరంగల్సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి

సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి

- Advertisement -
  • ఎస్సైకు మండల కాంగ్రెస్ నాయ‌కుల ఫిర్యాదు

నవతెలంగాణ-చిన్నగూడూరు: ఇటీవల సోషల్ మీడియాలో ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎస్సై కుశకుమార్ కు ఫిర్యాదు చేశారు. గురువారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మారబోయిన వెంకటేశ్వర్లు మాట్లాడారు. కురవి మండలం తట్టుపల్లి గ్రామానికి చెందిన ఓ జర్నలిస్ట్ అని, బ్లాక్మెయిల్ కు పాల్పడుతూ, డోర్నకల్ ఎమ్మెల్యే ఫోటోలను ప్రచురితం చేస్తున్న వ్యక్తిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

గ్రామంలో వార్డు సభ్యుడిగా గెలుపొందిన వ్యక్తి ఎంఎల్ఏ ను విమర్శించే స్థాయి తగునా అని హెచ్చరించారు. అసత్య ప్రచార పోస్టులతో పబ్బం గడుతూ, బ్లాక్మెయిల్ కు పాల్పడుతున్నట్లు ఆయన ఆరోపించారు. వెంటనే పోలీసు అధికారులు సమగ్ర విచారణ చేసి ఆ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సర్పంచులు కమలాకర్ , రమేష్, మండల కార్యదర్శి రవి కిరణ్, అవుల భిక్షం, వార్డ్ సభ్యులు మోహన్, శేఖర్, కాంగ్రెస్ నాయకులు కొత్త శేఖర్, పిల్లి వీరన్న,రమేష్ దేవేందర్ కృష్ణ, నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -