Thursday, July 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డ్రగ్స్ పై అవగాహన పోటీల్లో రాష్ట్రస్థాయికి ఎంపికైన ప్రజ్ఞ

డ్రగ్స్ పై అవగాహన పోటీల్లో రాష్ట్రస్థాయికి ఎంపికైన ప్రజ్ఞ

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలం రుద్రారం గ్రామ పంచాయతీ పరిధిలోని పాత రుద్రారం గ్రామానికి చెందిన విద్యార్థిని ప్రజ్ఞ ప్రతిభ కనబరిచింది. బుధవారం భూపాలపల్లి డిగ్రీ కాలేజీలో జరిగిన ‘వికసిత్ భారత్’ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ‘యాంటీ డ్రగ్’ అవగాహన సాంస్కతిక పోటీల్లో ప్రజ్ఞ పాడిన పాటకు జిల్లా మొదటి బహుమతి దక్కింది. డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలపై ఆమె పాడిన పాట ప్రేక్షకులను, న్యాయనిర్ణేతలను ఎంతగానో ఆకట్టుకుంది.ఈ విజయంతో ప్రజ్ఞ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైంది.ఈ సందర్భంగా గ్రామస్తులు,కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు ప్రజ్ఞను అభినందించారు. ‘యువత డ్రగ్స్కు దూరంగా ఉండాలనే సందేశాన్ని పాట ద్వారా ఇవ్వాలనుకున్నానట్లుగా ప్రజ్ఞ తెలిపింది.రాష్ట్ర స్థాయిలో కూడా మంచి ప్రదర్శన ఇచ్చి బహుమతి తెస్తానని ధీమా వ్యక్తం చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -