– మండల వ్యవసాయాధికారి స్వామి నాయక్
నవతెలంగాణ -పెద్దవంగర : ప్రభుత్వం సబ్సిడీ పై అందించే జీలుగు విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయాధికారి గుగులోత్ స్వామి నాయక్ అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జూన్ 1 నుండి మండలంలోని అవుతాపురం గ్రామంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రంలో సబ్సిడీ పై జీలుగు విత్తనాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. మొదటి విడతలో 200 క్వింటాళ్ల జీలుగు విత్తనాలు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. 30 కేజీల జీలుగు విత్తనాల ధర రూ. 4,905 కాగా, ప్రభుత్వం అందిస్తున్న 50 శాతం సబ్సిడీతో రైతులు రూ. 2,452.50 లకే రైతులకు లభిస్తుందన్నారు. జీలుగు విత్తనాల కోసం రైతులు పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు జిరాక్స్ లతో ఏఈవో లను సంప్రదించాలని కోరారు.
సబ్సిడీపై జీలుగు విత్తనాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



