నవతెలంగాణ – మునుగోడు: బ్రిటిష్ వారి తూటాలకే బెదరని కమ్యూనిస్టులు… కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తాటాకు బెదిరింపులకు కమ్యూనిస్టు నాయకులు భయపడేవారు కాదని సిపిఐఎం మండల కమిటీ సభ్యులు వేముల లింగస్వామి అన్నారు . శుక్రవారం కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ నివాసం మీద చేసిన ఈడి దాడులను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మరోసారి నీచమైన రాజకీయ కక్ష సాధింపులకు అధికారమును అడ్డం పెట్టుకుని రాజకీయ ప్రత్యర్ధుల మీద దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పడం పిరికిపంద చర్య అని అన్నారు . బెదిరింపులతో రాజకీయ పబ్బం గడుపుకోవాలని మోడీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందని అన్నారు. మోడీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తిప్పి కొట్టేందుకు బిజెపి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ప్రజలు విస్మరించే రోజులు వస్తాయని అన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం ను అందరూ నిరసించాలి అని పిలుపునిచ్చారు.
బీజేపీ తాటాకు చప్పుళ్లకు కమ్యూనిస్టులు భయపడరు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



