Wednesday, February 4, 2026
E-PAPER
Homeఖమ్మంమధ్యాహ్న భోజనంపై ఉపాధ్యాయులు ప్రతిరోజు పర్యవేక్షణ చేయాలి

మధ్యాహ్న భోజనంపై ఉపాధ్యాయులు ప్రతిరోజు పర్యవేక్షణ చేయాలి

- Advertisement -

– పెద్ద బీరవల్లి ప్రాథమిక పాఠశాలలో ఈ సి ఆర్ ను పరిశీలించిన మండల  స్పెషల్ ఆఫీసర్ 
– సంతృప్తి వ్యక్తం చేసిన మండల స్పెషల్ ఆఫీసర్ 
నవతెలంగాణ – బోనకల్

ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం లనే బోనకల్ మండల పరిధిలోనే పెద్ద బీరవల్లి ప్రాథమిక పాఠశాలను మండల స్పెషల్ ఆఫీసర్ కడారు విజయభాస్కర్ రెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులకు వెళ్లి విద్యార్థులను పలు ప్రశ్నలు వేసి వారి ప్రతిభను పరిశీలించారు. పాఠశాలలో అమలు జరుగుతున్న ఈసీఆర్ లో విద్యార్థుల ప్రతిభను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి మధ్యాహ్న భోజన వర్కర్లకు పలు  సూచనలు చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు, విద్యార్థులకు కొన్ని సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సి ఆర్ లో విద్యార్థుల ప్రతిభ ఎంతో బాగుంది అన్నారు.

మధ్యాహ్న భోజనం విషయంపై ఉపాధ్యాయులు ప్రతిరోజు భోజనం వండే ముందు భోజనం అనంతరం తప్పనిసరిగా పరిశీలించాలన్నారు. భోజనంలో ఎటువంటి పొరపాట్లు జరిగిన సంబంధిత ఉపాధ్యాయులే బాధ్యత వహించవలసి ఉంటుందన్నారు. భోజనం విషయంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. కొన్ని సందర్భాలలో ఫుడ్ పాయిజన్ అవుతుందని దీనివలన విద్యార్థుల అస్వస్థకు గురవుతున్నారని ఫలితం ఉపాధ్యాయులు అనుభవించవలసి వస్తుందని అందువల్ల ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజన విషయంపై పలు జాగ్రత్తలు తీసుకుంటూ నిత్యం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉపాధ్యాయులు విద్యా రంగలో  వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యాబాధన చేయాలని సూచించారు. మూస విద్యా బోధన చేయవద్దని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రభుత్వ విద్యారంగా అభివృద్ధిలో ఉపాధ్యాయులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రుల పాత్ర కూడా ప్రముఖంగా ఉండాలని సూచించారు. ఆయన వెంట  జానకీపురం కాంప్లెక్స్ సీఆర్పీ షేక్ మహబూబ్ పాషా, పాఠశాల ఉపాధ్యాయులు గుగులోతు రామకృష్ణ, మండెపూడి నరేష్, తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -