డైరెక్టర్ వెంకీ కుడుముల తన నిర్మాణ సంస్థ వాట్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న తొలి చిత్రం ‘ఇట్లు అర్జున’. ‘న్యూ గై ఇన్ టౌన్` అనేది ట్యాగ్ లైన్. అనీష్ హీరోగా పరిచయం అవుతుండగా, మహేష్ ఉప్పల దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా ఫస్ట్ సింగిల్ ‘హాయ్ రే`ను విడుదల చేశారు. హీరో నాని లాంచ్ చేసిన ఈ పాట యూత్‌ఫుల్ ఎనర్జీతో, క్యాచీ ట్యూన్‌తో ఆకట్టుకుంటోంది. తమన్ ఈ పాటను స్ట్రాంగ్ ఎలక్ట్రానిక్, హిప్హాప్ బీట్స్‌తో ఫాస్ట్ పేస్డ్ రిథమ్ నంబర్‌గా కంపోజ్ చేశారు. అనిరుధ్ రవిచందర్ తన ఎనర్జిటిక్ వోకల్స్‌తో పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సంజన ఆలపించిన కర్ణాటిక్ టచ్ నోట్స్, హర్ష వర్ధన్ ర్యాప్ సెగ్మెంట్ పాటకు కొత్త లేయర్స్‌ను జోడించాయి. కళ్యాణ్ చక్రవర్తి రాసిన సాహిత్యం సింపుల్‌గా, హార్ట్‌ఫుల్‌గా ఉండి హీరోయిన్ను దూరం నుంచి ప్రేమించే హీరో భావాలను అందంగా వ్యక్తపరిచింది. థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ సినిమాపై ‘హాయ్ రే’ సాంగ్ అంచనాలను మరింత పెంచింది.


