Saturday, May 30, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఅనర్హుల ఓట్లు తొలగించండి

అనర్హుల ఓట్లు తొలగించండి

- Advertisement -

శిక్ష‍ణా కార్య్రకమంలో 
రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సీ సుదర్శన్ రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్‌‌బ్యూరో

రాష్ట్రంలో నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో అర్హత కలిగిన ప్రతి ఓటరు పేరును ఓటరు జాబితాలో చేర్చాలని, అనర్హుల పేర్లను జాబితా నుంచి తొలగించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి చెప్పారు. శుక్రవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయంలో అదనపు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ డాక్టర్‌ వాసం వెంకటేశ్వర్ రెడ్డితో కలిసి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్‌) పై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల యంత్రాంగాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా రాష్ర్టంలో ‘సర్‌ ‌నిర్వహిస్తున్నట్టు తెలిపారు. జిల్లా ఎన్నికల అధికారులు (‌డీఈఓలు), ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (ఈఆర్‌ఓలు), అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (ఏఈఆర్‌ఓలు), బీఎల్‌ఓ సూపర్ వైజర్లు తదితర ఎన్నికల అధికారులు తమకు అప్పగించిన బాధ్యతలను క్రమశిక్ష‍ణతో పూర్తి చేయాలని చెప్పారు. ఐటీ సంబందిత కార్యకలాపాలు, చట్టపరమైన నిబంధనలు, సర్‌ ‌ప్రక్రియలోని దశలు, విధానాలు సహా పలు అంశాలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. వీడియో కాన్ఫరెన్స్ లో అన్ని జిల్లాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -