నవతెలంగాణ – అచ్చంపేట : లింగాల మండల కేంద్రానికి చెందిన జర్నలిస్టు రఘుపతి రాథోడ్ గత ఏడాది మృతి చెందాడు. తెలంగాణ మీడియా అకాడమీ నుంచి జర్నలిస్టు కుటుంబానికి లక్ష రూపాయల చెక్కును జర్నలిస్టు భార్య అలివేలకు బుధవారం మీడియా అకాడమీ కార్యాలయం హైదరాబాదులో అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టు యూనియన్ టియుడబ్ల్యూ జే హెచ్ -143 రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చందు నాయక్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టు అమరుల కుటుంబాలకు తెలంగాణ మీడియా అకాడమీ అండగా నిలుస్తూ.. వందలాది కుటుంబాలకు భరోసా కల్పిస్తుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 17 మంది జర్నలిస్టుల కుటుంబాలకు ప్రతి నెల రూ. 3000/- పెన్షన్ మంజూరు చేశారు. ఆర్థిక సహాయం చెక్కులను అందజేశారు. అండగా నిలిచిన తెలంగాణ మీడియా అకాడమీకి, సహకరించిన చందునాయక్‌కు అలివేలు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మీడియా అకాడమీ కార్యదర్శి వెంకటేశ్వర్లు ఉన్నారు.
జర్నలిస్టు కుటుంబానికి రూ.లక్ష చెక్కు అందజేత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



