నవతెలంగాణ-హైదరాబాద్: ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ అగ్రనేత అయతొల్లా అలీ ఖమేనీతో పాటు పలువురు కీలక నేతలు మరణించారు. తాజాగా అంత్యక్రియల నిర్వహణకు ఆ దేశ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్‌తో జరిగిన యుద్ధం కారణంగా నెలలపాటు వాయిదా పడిన ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. దేశం నలుమూలల నుంచీ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యేలా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
అంత్యక్రియల ఏర్పాట్ల కోసం ఒక ప్రత్యేక ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు టెహ్రాన్ కోఆర్డినేషన్ కౌన్సిల్ ఫర్ ఇస్లామిక్ ప్రొపగాండా అధిపతి మొహ్సెన్ మహమూదీ తెలిపారు. వివిధ ప్రభుత్వ ఏజెన్సీలు సమన్వయంతో పనిచేస్తున్నాయని, త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని ఆయన పేర్కొన్నారు.



