- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తూర్పు ఆఫ్ఘనిస్తాన్‌లోని లగ్మన్ ప్రావిన్స్‌లో శనివారం పాకిస్తాన్ నుంచి తిరిగి వస్తున్న ఆఫ్ఘన్ శరణార్థులతో వెళ్తున్న ట్రక్కు లోయలో పడిపోవడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో కనీసం 22 మంది మరణించగా, మరో 36 మంది తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్ నిద్రమత్తులో నియంత్రణ కోల్పోవడమే ప్రమాదానికి కారణమని అధికారులు తెలిపారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, పిల్లలే ఉన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
- Advertisement -



