Thursday, February 5, 2026
E-PAPER
Homeతాజా వార్తలుటాలీవుడ్‌లో మరో విషాదం..నటి కన్నుమూత

టాలీవుడ్‌లో మరో విషాదం..నటి కన్నుమూత

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. ఒకప్పుడు సినిమాలు, సీరియల్స్‌లో కీలక పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న నటి జయవాహిని కన్నుమూశారు. హైదరాబాద్‌ మణికొండలోని తన నివాసంలో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న జయవాహిని ఆరోగ్యం క్షీణించడంతో మృతి చెందినట్లు తెలుస్తోంది. ఆమె మృతదేహాన్ని స్వస్థలం శ్రీకాకుళం జిల్లాకు తరలించగా, అక్కడే ఇవాళ (గురువారం) అంత్యక్రియలు నిర్వహించనున్నారు. జయవాహిని మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -