Sunday, May 31, 2026
E-PAPER
Homeసోపతిస్నేహలతా రెడ్డి చీకటి చెరసాలలో చిత్రహింసలు

స్నేహలతా రెడ్డి చీకటి చెరసాలలో చిత్రహింసలు

- Advertisement -

అకస్మాత్తుగా మోగిన ఫోన్‌ శబ్దం నిశ్శబ్దాన్ని చీల్చింది. తను చేరేలోపు అది ఆగకూడదని ఆదుర్దాగా మెట్లపై నుండి వేగంగా కిందకి పరిగెత్తింది. ఆ ఫోన్‌లో తన తల్లి గొంతు వినిపించింది. ”నన్ను మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చారు, నువ్వు రాగలవా?” వారు ఆమెను అక్కడి నుండి తీసుకువెళ్ళేలోపు తాను అక్కడికి చేరుకోవాలని విక్టోరియా ఆసుపత్రికి పరుగెత్తింది. 50 ఏళ్ళ తర్వాత కూడా ఈ దశ్యాలు ఆమెను వెంటాడుతూనే ఉన్నాయి. ఆ ఫోన్‌ మోగితే ఆమె ఇప్పటికీ చెమటలు పడుతూ నిద్రలేస్తుంది. ఎమర్జెన్సీ కాలం నాటి ప్రభుత్వ ఉన్మాదాన్ని ఈ దురంతం ద్వారా మనకు తెలుస్తుంది.

ఇంతకు ఆసుపత్రి నుండి ఫోన్‌ చేసిన వారు దక్షిణ భారతదేశంలో అత్యంత సహజనటిగా పేరొందిన స్నేహలతా రెడ్డి. ఈ పేరు చెప్పగానే మనకు ఒళ్ళు జలదరించే 1975 – 77 మధ్య భారతదేశ కల్లోల కాలానికి ఆమె ఒక దష్టాంతంగా కనిపిస్తుంది. పై సందర్భాన్ని పేర్కొన్నది ఆమె కుమార్తె, మానవ హక్కుల కార్యకర్త నందనా రెడ్డి.
స్నేహలతా రెడ్డి 1932 అక్టోబర్‌ 9న ఏడెన్‌లో ఒక తమిళ క్రైస్తవుడు, ఒక కాశ్మీరీ తల్లికి జన్మించింది. ఆమెకు ఐదుగురు సోదరులు ఉండగా, వారిలో ఇద్దరు చాలా చిన్న వయసులోనే మరణించారు.
ఆమె బ్రిటిష్‌ వలస పాలనను తీవ్రంగా వ్యతిరేకించింది. విద్యార్థినిగా ఉన్న కాలంలోనే స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నది. బ్రిటీష్‌ వారి దాష్టీకాలపై ఆగ్రహం వ్యక్తం చేసి వారికి వ్యతిరేకంగా పోరాటం చేసింది. వలసవాద సంస్కృతికి నిరసనగా అప్పటిదాకా ధరిస్తూ వచ్చిన విదేశీ సాంప్రదాయ దుస్తులను వదిలి భారతీయ సాంప్రదాయ దుస్తులలోకి మారిపోయింది.

ఆమె 1960లలో మద్రాస్‌ ప్లేయర్స్‌కు సహ వ్యవస్థాపకురాలు. ఇది డగ్లస్‌ అల్గర్‌ దర్శకత్వం వహించిన ఇబ్సెన్స్‌ పీర్‌ జింట్‌ వంటి మరపురాని ప్రదర్శనలను ఇచ్చిన ఔత్సాహిక బృందంలో ఆమె కూడా ఒకరు. ‘ట్వెల్త్‌ నైట్‌, టేనస్సీ విలియమ్స్‌ నైట్‌ ఆఫ్‌ ది ఇగువానా, పీటర్‌కో’లకు దర్శకత్వం వహించింది. అంతేకాకుండా, ‘ఎ వ్యూ ఫ్రమ్‌ ది ఫ్రెండ్స్‌, ది హౌస్‌ ఆఫ్‌ బెర్నార్డ్‌ ఆల్బా’ వంటి నాటకాలలో నటించింది. ఎన్నో ప్రశంసలు పొందిన ‘పీర్‌ గైంట్‌’ ప్రదర్శనలిచ్చింది. ఆమెకు నత్యం, నటించడం అంటే ఇష్టం. నాటకాల అభిరుచి కారణంగానే ఆ తర్వాత ప్రముఖ కవి, సినీ నిర్మాత, దర్శకుడు అయిన తిక్కవరపు పట్టాభి రామారెడ్డిని వివాహం చేసుకుంది. పఠాభి – స్నేహలత దంపతులు లోహియా సోషలిస్టు సిద్ధాంతాలతో ప్రభావితులయ్యారు. వారిద్దరి వైవాహిక జీవితం ఒక కళాసంగమంగా చెప్పుకోవచ్చు.
స్నేహలతా రెడ్డి నాటకాలలో నటిస్తూనే కేవలం ఎంపిక చేసుకున్న మూడు సినిమాలలోనే నటించింది. అవి ‘సంస్కార (1970), చంఢ మారుత (1977), సోనే కన్సారి (1977)’.

పట్టాభి రామరెడ్డి దర్శకత్వంలో రూపొందిన ‘సంస్కార’లో స్నేహలతా రెడ్డి చంద్రి పాత్రను పోషించింది. తను నటించే సినిమాలోని కథల పట్ల, అందులో పోషించే పాత్రల పట్ల ఆమెకు లోతైన జిజ్ఞాసతో కూడిన అధ్యయనం, బలమైన స్ఫూర్తి ఉండేవి.
స్నేహ నటించిన చిత్రాలలో సంస్కార ద్వారానే ఆమె దేశవ్యాప్తంగా పరిచయమైంది. ఈ చిత్ర కథ కర్ణాటకలోని ఒక అగ్రహారంలో మధ్వ బ్రాహ్మణుల ఆచారాలు, కుల వ్యవస్థ, మతం, నైతికత చుట్టూ తిరుగుతుంది. ఈ చిత్రంలో ఇంకా గిరీష్‌ కర్నాడ్‌, అమ్రీష్‌ పూరిలు నటించారు.
ఈ సినిమా తీసిన తిక్కవరపు పఠాభిరామిరెడ్డిదిహొనెల్లూరు. ఇతడు శాంతినికేతన్‌లోహొరవీంద్రనాథ్‌ టాగూర్‌హొవద్ద, అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. ఇంగ్లీషు లిటరేచర్‌ చదివాడు. న్యూయార్క్‌లోని వ¶్యజియం ఆఫ్‌ మోడ్రన్‌ ఆర్ట్‌లో సినిమాల గురించి అధ్యయనం చేశాడు. ‘పెళ్లినాటి ప్రమాణాలు, శ్రీకృష్ణార్జున యుద్ధం’హొ సినిమాలు తీసిన జయంతి సంస్థలో భాగస్వామిగా ఉన్నాడు. వాస్తవిక చిత్రాలను, ప్రయోజనాత్మకమైన చిత్రాలను నిర్మించాలన్నది ఆయన ఉద్దేశం. ఒకసారిహొరాంమనోహర్‌ లోహియాహొఇతని ఇంటికి వచ్చాడు. ఆ సందర్భంలో యు.ఆర్‌. అనంతమూర్తిహొ’సంస్కార’ నవల గురించి చర్చకు వచ్చింది. ఆ నవల కన్నడ దేశంలో సంచలనం సృష్టించిందని తెలుసుకుని ఆ నవలను సినిమాగా మలిస్తే బాగుంటుందనే ఆలోచన కలిగింది. ఆ తర్వాత వారు ఆ నవలను చదివి ‘రామ్‌ మనోహర చిత్ర’ అనే బ్యానర్‌పై పట్టాభి దర్శకత్వంలో సినిమాగా తీశారు.
కన్నడంలో ప్రచారంలో ఉన్న నవల కాబట్టి సినిమాను కూడా కన్నడ భాషలోనే నిర్మించాలని పఠాభి భావించాడు. ‘మెడ్రాస్‌ ప్లేయర్స్‌’ నాటక సంస్థలోని అమెచ్యూర్‌ కళాకారులతో ఈ సినిమా తయారయింది. ఆ సంస్థ సభ్యుడైనహొగిరీష్‌ కర్నాడ్‌ హీరోగా నటించడమే గాక స్క్రీన్‌ ప్లే, డైలాగులు కూడా రాశాడు. ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సింగీతం శ్రీనివాసరావు. శృంగేరీ పీఠానికి సమీపంలో ఉన్న వైకుంటపురం, ఆ గ్రామ పరిసరాలలో 20 రోజులలో చిత్రీకరణ పూర్తి చేశారు. ఈ చిత్రానికి ఆస్ట్రేలియన్‌ ఛాయాగ్రాహకుడు టామ్‌కోవన్‌ పనిచేశాడు.

ఈ చిత్రంలో సెట్లు లేవు. నటులకు మేకప్‌ వేయలేదు. ఏ పాత్రకైనా గడ్డం పెరగవలసి వస్తే ఆ నటుడికి గడ్డం పెరిగే వరకూ ఆగారు కానీ ఎవరికీ, ఎక్కడా గడ్డం అతికించలేదు. ఈ చిత్రంలో పాటలు లేవు. కాని బ్యాక్‌ గ్రౌండ్‌ వ¶్యజిక్‌ మాత్రం ఉంది. ఈ సినిమాకు రాజీ తారానాథ్‌ కేవలం మూడు వాయిద్యాలతోనే నేపథ్య సంగీతం చేశాడు.
స్థానిక సెన్సార్‌ బోర్డు బొంబాయిలోని కేంద్ర సెన్సార్‌ బోర్డు సభ్యులు ఈ చిత్రాన్ని చూసి ప్రదర్శనకు అనుమతులు నిరాకరించారు. దాంతో నిర్మాత భారత ప్రభుత్వాన్ని అభ్యర్థించాడు. అప్పటి పార్లమెంటు సభ్యుడు నటుడుహొకొంగర జగ్గయ్యహొఈ సినిమా ప్రదర్శన అనుమతుల కోసం నిర్మాతకు తోడ్పడ్డాడు. నాటి కేంద్ర సమాచార శాఖ మంత్రి ఈ.కే.గుజరాల్‌ ఈ సినిమాను స్వయంగా చూసి అనుమతులు ఇప్పించాడు.

ఇంతగా అవాంతరాలను ఎదుర్కొన్న ఈ సంస్కారలోని కథ ఏమిటంటే –
నారాయణప్ప అనే బ్రాహ్మణుడు భగవదారాధన, సదాచారాలను విడిచి మద్యమాంసాల సేవనం, వేశ్యా సాంగత్యంలో గడిపేవాడు. అలా ఉంటూనే అతను మరణించాడు. కుల బ్రష్టుడైన అతనికి బ్రాహ్మణ ఆచారాల ప్రకారం దహన సంస్కారాలు చెయ్యలా? వద్దా? అన్నది అగ్రహారంలో పెద్ద సమస్యయి కూచున్నది. గ్రామంలోని బ్రాహ్మణులంతా కలిసి తమకు గౌరవనీయుడు, పండితుడూ అయిన ప్రాణేశాచార్యను సలహా అడిగారు. ప్రాణేశాచార్య సంధిగ్ధంలో పడ్డాడు. గ్రంథాలు, పుస్తకాలు తిరిగేసినా ఇందుకు ఆ అతనికేమీ పరిష్కారం కనిపించలేదు. మరోవైపు ప్రాణేశాచార్య వైవాహిక జీవితం సుఖమయం కాదు. పెళ్లయిన నాటి నుంచి అతని భార్య రోగిష్టిగానే వున్నది. ఐతే నారాయణప్ప భౌతిక దేహం ఇంకా అలా వుండగానే ప్రాణేశాచార్య ఒక వేశ్యకు తటస్థపడి, ఆమెతో గడుపుతాడు. అప్పుడు అప్పుడున్న పరిస్థితులలో తానేం చేశాడో ప్రాణేశాచార్య తెలిసి వచ్చింది. తను చేసింది ఘోరమైన తప్పిదమని అర్థమైంది. ధర్మశాస్త్రాలు వల్లిస్తూ నీతులు చెప్పడం సంస్కారం కాదనుకున్నాడు. నారాయణప్పకు అంత్యక్రియలు జరపడానికి నిశ్చయించుకున్నాడు. తర్వాత పశ్చాత్తాపంతో తీర్థయాత్రలకు బయలు దేరాడు.
భారత ప్రభుత్వం ఈ చిత్రానికి 1970 సంవత్సరానికి గానుహొజాతీయ ఉత్తమ చలనచిత్రంగాహొఎంపిక చేసింది. కన్నడ భాషకి ఇదే తొలి జాతీయ పురస్కారం. ఈ చిత్రానికి బొంబాయి ఫిల్మ్‌ ఫోరం ‘దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు’ను ఇచ్చింది. కర్ణాటక ప్రభుత్వం ఉత్తమకథ, ఉత్తమ సహయనటుడు, ఉత్తమ ఛాయాగ్రహణం విభాగాలలో రాష్టస్థాయి పురస్కారాలను అందజేసింది.

చీకటి రోజులు
ఈ నేపథ్యంలో 1971లో పాకిస్థాన్‌పై విజయం సాధించి ఇందిరా గాంధీ ప్రజాదరణ శిఖరాగ్రంలో ఉన్నప్పటికీ, 1973 నాటికి అధిక ద్రవ్యోల్బణం, ఆర్థిక అస్థిరత, అవినీతి, జీవన ప్రమాణాల క్షీణతకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలతో ఉత్తర భారతదేశం అట్టుడికింది. 1975 జూన్‌లో అలహాబాద్‌ హైకోర్టు గత ఎన్నికల సమయంలో శ్రీమతి గాంధీ చట్టవిరుద్ధంగా వ్యవహరించిందని నిర్ధారించి, ఆమెను పదవి నుంచి వైదొలగమని ఆదేశించింది. ఆమె రాజీనామా కోసం దేశవ్యాప్తంగా డిమాండ్లు వెల్లువెత్తడంతో, ఇందిర.1975 జూన్‌ 26న ఎమర్జెన్సీని ప్రకటించింది.

ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమానికి నాంది పలికింది. ఇందిరకు వ్యతిరేకంగా జార్జ్‌ ఫెర్నాండెజ్‌ ఒక రహస్య ఉద్యమాన్ని ప్రారంభించాలని ప్రతిపాదించారు. అది అహింసాత్మకంగా ఉండాలని స్నేహలత తీవ్రంగా వాదిస్తుండగా, ఆయన మాత్రం హింసను సమర్థించారు. మన రాజ్యాంగ స్వేచ్ఛలను నిరాకరిస్తున్నప్పుడు మనం కేవలం ప్రేక్షకులుగా ఉండలేం. పౌరులుగా ఎవరికి వారుగా తమ బాధ్యతలను నిర్వర్తించాలని స్నేహ అభిప్రాయపడేది. ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నందుకు, జార్జ్‌ ఫెర్నాండేజ్‌కు ఆశ్రయం ఇచ్చిందన్న కారణంతో బరోడా డైనమైట్‌ కేసులో ఆమెను అక్రమంగా అరెస్టు చేసి 8 నెలలకు పైగా జైలులో నిర్బంధించి, చిత్రహింసలకు గురి చేశారు. జైలు అధికారులు ఆమెను వివస్త్రను చేసి దారుణంగా హింసించారు. ఆ హింసలు తట్టుకోలేక ఆమె పెట్టే కేకలు జైలు అంతటా ప్రతిధ్వనించేవని ఆమె జైలు సహచరులు ఇప్పటికీ చెప్పుకుంటారు. కన్నడంలో తొలి నవ్య సినిమా ‘సంస్కార’మే.
చివరికి స్నేహలతా ఆరోగ్యం క్షీణించడంతో ఎనిమిది నెలల తర్వాత పోలీసులు విడుదల చేశారు. కానీ విడుదలైన ఐదు రోజులకే ఆమె కన్ను మూసింది. ఆరోజు 1977 జనవరి 20. ఆమె మరణం దేశంలోని మేధావుల్ని, రచయితల్ని, ప్రగతివాదుల్ని తీవ్రంగా కలచివేసింది. ఒక నటిగా తన సామాజిక బాధ్యతను మరువని స్నేహలత రెడ్డి చీకటి చెరలలో అనుభవించిన చిత్రహింసలు దేశ చరిత్రలోనే రక్తాక్షరాలతో లిఖించదగినవి. నిజంగా ఆమె ఎమర్జెన్సీ మింగిన సినీ ‘చంద్రి’క.

హెచ్‌ రమేష్‌ బాబు,
7780736386

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -