- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని మెనూర్, ఆవల్గవ్, గ్రామ శివారులో వేసిన శనగ, మొక్కజొన్న, జొన్న పంటలను మండల వ్యవసాయ అధికారి రాజు గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొక్కజొన్న పంటలో కత్తెర పురుగు గమనించామని తెలిపారు. వాటి నివారణకు 80గ్రాముల ఇమమెక్టిన్ బెంజాయోట్ లేదా క్లోరాంట్రినిప్రోల్ 60 ఎంఎల్ ఒక లీటర్ వేప నూనెలో కలిపి ఎకరా పంటకి 200లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలని రైతులకు సూచించారు. అలాగే యాసంగిలో సాగు చేస్తున్న పంటలను ఆయా గ్రామాల ఏఈవో ల దగ్గర పంటల సాగు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈవో లు సంపత్, సౌమ్య, ఎఫ్ పి ఓ చైర్మన్ గోపాల్ పాల్గొన్నారు.
- Advertisement -



