Saturday, May 30, 2026
E-PAPER
Homeజాతీయంరాజస్థాన్‌లో భారీ ఇసుక తుపాను...

రాజస్థాన్‌లో భారీ ఇసుక తుపాను…

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : రాజస్థాన్‌లోని పలు జిల్లాలను శనివారం శక్తిమంతమైన ఇసుక తుపాను ముంచెత్తింది. దట్టమైన ధూళి మేఘాలు ఆకాశాన్ని కమ్మేయడంతో వాతావరణం ఒక్కసారిగా అంధకారంగా మారింది. ఇసుక తుపాను అనంతరం భారీ వర్షం కురిసింది. ఈ తుపాను ప్రభావం చురు జిల్లాపై అధికంగా కనిపించగా, బికనీర్, శ్రీ గంగానగర్ జిల్లాల్లోనూ జనజీవనం అస్తవ్యస్తమైంది. సుమారు 30 నిమిషాల పాటు బలమైన ఈదురు గాలులతో కూడిన ఈ తుపాను బీభత్సం సృష్టించింది. ఈ గాలులకు ఇసుక భారీగా కొట్టుకొచ్చి రోడ్లు, నివాస ప్రాంతాలను కప్పేసింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల రహదారులపై కొన్ని అడుగుల మేర ఇసుక పేరుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి.

తుపాను సమయంలో దారి కనిపించక ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. శ్రీ గంగానగర్ వంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 48 డిగ్రీలు దాటడం అక్కడి తీవ్ర పరిస్థితులకు అద్దం పడుతోంది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం గానీ, ఆస్తి నష్టంపై గానీ జరిగినట్లు సమాచారం అందలేదని అధికారులు తెలిపారు. రానున్న రోజుల్లోనూ బికనీర్, షెఖావతి ప్రాంతాల్లో ఇలాంటి వాతావరణ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -