నవతెలంగాణ – తిమ్మాజిపేట : బడి ఈడు పిల్లలను బడిలోకి చేర్పించాలని ఏపీఎం నిరంజన్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు అమృత ఆధ్వర్యంలో ప్రభుత్వం చేపడుతున్న ప్రజాపాలన – ప్రగతి నివేదిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా స్వయం సహాయక సంఘల మహిళలు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి వీధి లలో తిరుగుతూ ప్రజలను చైతన్యం చేసే స్లొగన్స్ ను కటౌట్స్ ద్వార ఆహ్వానం కల్పించారు . బడి ఈడు పిల్లలను బడికి పంపించాలి మహిళలను గౌరవించాలి మహిళలపై జరుగుతున్న హింసలను నిరోధించాలి అంటరాని తనాన్ని నిర్మూలించాలని ఏపిఎం బి నిరంజన్ తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలలో అందరికీ అందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షురాలు అమృత అనిత పోచమ్మ జ్యోతి సీసీలు యాదమ్మ, తిరుపతమ్మ, నాగరాజు, వెంకటేశ్వరమ్మ, ఆపరేటర్ వికాస్ అకౌంటెంట్ మమత వివోఏలు సుమ యాదమ్మ వసంత సుజాత మౌనిక శ్రీను నరేందర్ వున్నారు.
బడి ఈడు పిల్లలను బడిలోకి పంపించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



