Thursday, February 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలి 

పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలి 

- Advertisement -

ఐసిడిఎస్ మేచరాజుపల్లి సెక్టర్ సూపర్వైజర్ జలగం సునీత 
గ్రామ సర్పంచ్ తూర్పాటి శంకర్ 
నవతెలంగాణ – నెల్లికుదురు
అంగన్వాడి కేంద్రాలలో లభ్యమయ్యే పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని మేచరాజుపల్లి సెక్టర్ సూపర్వైజర్ జలగం సునీత  ఆ గ్రామ సర్పంచ్ తూర్పాటి శంకర్, ఉప సర్పంచ్ తాళ్లపల్లి వెంకన్న అన్నారు. మేచరాజు పల్లి గ్రామంలోని ఎస్సీ సెంటర్ 2 లో గురువారం ఏ ఎల్ ఎం ఎస్ సి కమిటీని వేసి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..అంగన్వాడి కేంద్రంలోని అంగన్వాడి టీచర్లు విధులు సక్రమంగా నిర్వహించాలని అందులో లభ్యమయ్యే పౌష్టికాహారాన్ని అంగన్వాడీ కేంద్రానికి వచ్చేవారికి ఇచ్చి వారిపై అవగాహన పెంచాలని అన్నారు.

ఇందులో దొరికే పౌష్టికాహారం తీసుకుంటే గర్భిణీలు బాలింతలు కిశోర బాలికలు మంచి ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. ఈరోజు వేసిన కమిటీ అంగన్వాడి సెంటర్లో దృష్టి సారించి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు వెల్తూరి సునీత ,ఎం లీలావతి, ఆర్ సరోజన, ఎండి మైబూబి, వార్డు సభ్యులు హైమా, పంచాయతీ కార్యదర్శి రఫీ,ఆశ వర్కర్ శోభ, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -