డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కు తున్న చిత్రం ‘సింగ్ గీతం’. మరోసారి ఆయన వినూత్నమైన కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై నాగ్ అశ్విన్ నిర్మిస్తున్నారు. తాజాగా విడుదలైన ‘ఏమైంది’ పాట ఆ చిత్రంలోని విభిన్న ప్రపంచానికి సరదా పరిచయాన్ని అందించింది. ఈ పాటను హీరోయిన్ శృతి హాసన్ లాంచ్ చేశారు.
ఈ పాట ఓ మ్యూజికల్ పజిల్‌లా సాగుతుంది. ఒక వింత పరిస్థితిలో చిక్కుకున్న గ్రామాన్ని ఈ పాట పరిచయం చేస్తుంది. ఆ గ్రామంలో సాధారణ సంభాషణలన్నీ పాటలుగా మారిపోతాయి. ఎందుకు ఇలా జరిగిందో ఎవరికీ అర్థం కాకపోయినా, గ్రామస్తులంతా ఆ పరిస్థితికి అలవాటు పడాల్సి వస్తుంది. ప్రశ్నలు, సందేహాలు, ఆశ్చర్యాలన్నీ ట్యూన్స్ గా మారిపోతూ వినోదాన్ని పంచుతాయి. దేవిశ్రీ ప్రసాద్ అందించిన ట్యూన్ ఈ పాటకు మరింత ఆకర్షణగా నిలిచాయి. మరో విశేషం ఏమిటంటే, ఈ పాటను చిత్రంలోని నటీనటులే ఆలపించడం. దీంతో పాట మరింత సహజంగా, కథలో భాగంగా అనిపిస్తుంది. శ్రీమణి, దేవిశ్రీ ప్రసాద్, గౌతమ్ చల్లగుల్ల, రత్న శ్రీకర్, శశాంక్ చింతలపూడి కలిసి రాసిన సాహిత్యం చిత్రంలోని విచిత్ర పరిస్థితిని, గ్రామస్తుల భావోద్వేగాలను సరదాగా ప్రజెంట్ చేసింది.
నూతన నటులు అయాన్, అహల్య, శాలిని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం జూన్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఓ మ్యాజికల్ పజిల్..
- Advertisement -
- Advertisement -



