- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామానికి చెందిన ఇందారపు చిన రాజయ్య (47) పారిశుద్ధ్య కార్మికుడు వడదెబ్బతో మృతి చెందిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, కుటుంబ సభ్యుల పూర్తి కథనం ప్రకారం రాజయ్య కొన్ని సంవత్సరాలుగా తాడిచెర్ల గ్రామపంచాయతీ కార్యాలయంలో పారిశుద్ధ కార్మికునిగా పనిచేస్తున్నాడు. రోజులాగే సోమవారం ఉదయం విధులు నిర్వహిస్తుండగా వడదెబ్బ తగిలి అస్వస్థతకు గురై, తలతిప్పుతుందని చెప్పి అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు. రాజయ్యది నిరుపేద దళిత కుటుంబం. ఆయన మృతితో కుటుంబం రోడ్డున పడింది. ప్రభుత్వం ఆర్థికంగా మృతుని కుటుంబాన్ని ఆదుకొని, భార్యకు ఉద్యోగం ఇవ్వాలని గ్రామస్తులు కోరుతున్నారు.
- Advertisement -



