Friday, February 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మండల నూతన కార్యవర్గం ఎన్నికలు

మండల నూతన కార్యవర్గం ఎన్నికలు

- Advertisement -

నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ కమ్మర్ పల్లి మండల నూతన కార్యవర్గం ఎన్నికలు శుక్రవారం నిర్వహించారు. కమ్మర్ పల్లి మండల ఉన్నత పాఠశాలల తెలుగు, హింది ఉపాధ్యాయ ఎన్నికలు మండల కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా కె. బంతిలాల్, ప్రధానకార్యదర్శిగా  ఎ.రత్నమాల, కోశాధికారి టి.ఆనంద్, వర్కింగ్ ప్రెసిడెంట్ టి.మైత్రి, ఉపాధ్యక్షులుగా డి.రాంపాల్, యు.సభిత, కె.రాజశేఖర్,  కార్యదర్శులుగా ఎస్.శ్రీ హరి, వి.గీత రాణి, డి.జె మమత, పి.చంద్రకళ, హెచ్. వీణ, ముఖ్య సలహాదారులుగా వంగరి మధుసూదన్, పుట్ట రాజేశ్వర్, రంగాచార్య లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ ఎన్నికల పరిశీలకులుగా జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ కృష్ణ వర ప్రసాద్ హాజరయ్యారు. ఈ సమావేశంలో  రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్  కాలమానిని, క్యాలెండరును మండల విద్యా శాఖాధికారి యన్.ఆంధ్రయ్య ఆవిష్కరించారు. మండలంలోని ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న తెలుగు, హింది, ఉపాధ్యాయుల  సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తూ,  విద్యార్థులు శ్రేయస్సుకై, పండిత పరిషత్ నిరంతరం కృషి చేస్తుందని నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -