తెలుగు సినిమా పరిశ్రమ ఏ క్షణంలో ఎలాంటి సాయం కోరినా తెలంగాణ ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అభయమిచ్చారు. ఉగాది పండగ నేపథ్యంలో మార్చి 19న గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. శుక్రవారం ప్రసాద్‌ల్యాబ్స్‌లో గద్దర్ ఫిల్మ్ అవార్డుల స్క్రీనింగ్ ప్రక్రియను ప్రారంభించిన సందర్బంగా మీడియాతో ఆయన మాట్లాడారు.
‘భారతీయ చలన చిత్ర పరిశ్రమకు హైదరాబాద్‌ను కేంద్రంగా చేయాలన్నది తెలంగాణా ప్రభుత్వం బలంగా సంకల్పించింది. సామాజిక మార్పు కోసం కళను ఆయుధంగా మలిచిన ప్రజా యుద్ధనౌక గద్దర్ స్మారకార్థం నిర్వహిస్తున్న ఈ అవార్డుల వేడుక 2వ ఏడాదిలోకి ప్రవేశించడం గర్వకారణం.
ఉగాది పర్వదినం సందర్భంగా నభూతో నభవిష్యత్తు అనే రీతిలో ఈ వేడుకను ప్రభుత్వం అత్యంత ఘనంగా నిర్వహిస్తుంది. ప్రపంచ సినీ పరిశ్రమ మొత్తం హైదరాబాద్ వైపు చూసేలా, తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు అన్ని భాషల చిత్రాలకు మన నగరాన్ని గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దడమే ప్రజా ప్రభుత్వ సంకల్పం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సహకారంతో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుంది. ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు, జ్యూరీ చైర్మన్ మణిశర్మ ఆధ్వర్యంలో పారదర్శకంగా అవార్డుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది’ అని తెలిపారు.
స్క్రీనింగ్ మొదలైంది..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



