నవతెలంగాణ – సుల్తాన్ బజార్ : బలవంతపు బదిలీలపై ప్రభుత్వం పునరాలోచించాలని,2024 లో లాంగ్ స్టాండింగ్ లో తెలంగాణ లో వున్న 40% లో వున్న నర్సింగ్ ఆఫీసర్స్ ను తమకు నచ్చినట్లు ట్రాన్స్ఫర్ చేయడం జరిగినది, మారు మాట్లాడకుండా డ్యూటీస్ చేసుకోవడం జరుగుతున్నది ,2026 లాంగ్ స్టాండింగ్ లో ట్రాన్స్ఫర్ కి మళ్ళీ 2024 లో లాంగ్ స్టాండింగ్ లో డిస్ట్రబ్ అయిన వారిని కూడా కలపడం అన్నది అన్యాయం అని నర్సింగ్ ఆఫీసర్స్ అన్నారు. సోమవారం కోఠి లోని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయం ముందు వారు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో 2018 అప్పటి ప్రభుత్వం హయాంలో 20% మాత్రమే ట్రాన్స్ఫర్ చేయడం జరిగేది అదికూడా అవసరం అయితేనే, సూపర్ స్పెషాలిటీలు లో వున్న వారిని డిస్ట్రబ్ చేసే వారు కాదు అన్నారు ,డాక్టర్స్ కి జూనియర్స్ కి మధ్యవర్తులుగా ఉండి ఎంతో సేవ చేసేవారు నర్సింగ్ సిబ్బంది మీ అన్నారు ,తాము పెట్టుకున్న రిక్వెస్ట్ లో ఒక్కటి కూడా ప్రభుత్వం ఒప్పుకోవడం లేదని నర్సులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళన చేసిన వారికి ఎక్స్టెన్షన్ చేశారని అమలు చేశారని తెలిపారు
అసలు నర్సింగ్ సిబ్బంది యొక్క ప్రాధాన్యతను గుర్తిస్తున్నారా? కరోనా సమయంలో ఎందుకు ఎటువంటి లాంగ్ స్టాండింగ్ ట్రాన్స్ఫర్ చేయలేదు అన్నారు,పెద్ద పెద్ద రోగాలు వచ్చినప్పుడు నర్సింగ్ సిబ్బంది యొక్క సహాయము కోరుకోవడం వారి ప్రాణాలు పణంగా పెట్టి వారితో పని తీసుకోవడం ఒక్కటే అందరికీ తెలిసినది అన్నారు. రాష్ట్ర సీఎం ఇప్పటివరకు నర్సింగ్ సిబ్బంది తో కలిసి ఒక్క నిమిషం అన్నా మాట్లాడాడా? అని అన్నారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి తో నర్సింగ్ ఆఫీసర్లతో కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులు కోరారు. ప్రభుత్వం నర్సింగ్ ఆఫీసర్స్ బదిలీలపై పూర్ణ పురనాల్ పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు.



