Tuesday, June 2, 2026
E-PAPER
Homeజాతీయంకేరళ డిప్యూటీ స్పీకర్ గా షానిమోల్ ఉస్మాన్ ఎన్నిక

కేరళ డిప్యూటీ స్పీకర్ గా షానిమోల్ ఉస్మాన్ ఎన్నిక

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : కేరళ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా షానిమోల్ ఉస్మాన్ ఎన్నికయ్యారు. మంగళవారం జరిగిన ఎన్నికల్లో ఎల్‌డీఎఫ్ అభ్యర్థి, సీపీఐ ఎమ్మెల్యే మహమ్మద్ ముహ్సిన్‌పై ఆమె విజయం సాధించారు. 140 మంది సభ్యులున్న కేరళ శాసనసభలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కు 102 మంది ఎమ్మెల్యేల మెజారిటీతో షానిమోల్ ఎన్నిక లాంఛనమైంది. ఓటింగ్‌లో షానిమోల్‌కు 99 ఓట్లు రాగా, ముహ్సిన్‌కు 34 ఓట్లు లభించాయి. గత 35 ఏళ్లలో ఈ పదవిని చేపట్టిన తొలి మహిళగా షానిమోల్ చరిత్ర సృష్టించారు. రాష్ట్ర చరిత్రలో ఈ పదవిని చేపట్టిన నాల్గవ మహిళగా ఆమె నిలిచారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -