Tuesday, June 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పడంపల్లిలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

పడంపల్లిలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని పడంపల్లి జిపి గ్రామంలో మంగళవారం గ్రామ సర్పంచ్ వాగ్మారే విజయ కుమారి సంజు ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగిందని జిపి కార్యదర్శి గంగాధర్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ పోరాటంలో పాల్గొన్న పలువురికి ఘనంగా శాలువాతో సన్మానించడం జరిగింది. గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ వర్కర్స్  హెల్త్ కిట్ మరియు నిత్యావసరార వస్తువులు అందజేయడం జరిగింది. జిపి కార్యదర్శి గంగాధర్,  జీపిఓ సురేష్, అంగన్వాడి టీచర్ లక్ష్మీబాయి పటేల్, ఆశా కార్యకర్త భాగ్యలక్ష్మి, ఫీల్డ్ అసిస్టెంట్ సూర్యకాంత్, మల్టీపర్పస్ వర్కర్స్ వాగ్మారే మారుతి , విట్టల్ , గ్రామ మహిళా సంఘాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -