Tuesday, June 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కమ్మర్ పల్లిలో ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో బడిబాట

కమ్మర్ పల్లిలో ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో బడిబాట

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో మంగళవారం ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉపాధ్యాయులు, విద్యార్థులు బడిబాట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో అవగాహన ర్యాలీ చేపట్టారు.ర్యాలీని ప్రధానోపాధ్యాయులు పసుపుల సాయన్న  ప్రారంభించారు. ర్యాలీ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేస్తూ విద్యార్థులు ఉత్సాహంగా నినాదాలు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న నాణ్యమైన విద్య, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు, ఇతర సౌకర్యాల గురించి ప్రజలకు వివరించారు.

పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. ర్యాలీ మధ్యలో సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్ పాల్గొని సహకారాన్ని అందించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యాభివృద్ధికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఆశా వర్కర్లు కూడా ర్యాలీలో పాల్గొని తమ మద్దతును ప్రకటించారు.గ్రామంలోని ప్రధాన వీధుల గుండా సాగిన ర్యాలీకి ప్రజల నుండి విశేష స్పందన లభించింది.ప్రభుత్వ పాఠశాలల పట్ల ప్రజల్లో మరింత అవగాహన కలిగించేలా ఈ కార్యక్రమం సాగింది. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వినోద్, ఉప సర్పంచ్ కొత్తపల్లి అశోక్, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మల్యాల సుభాష్ గౌడ్, వార్డు సభ్యులు, ఉపాధ్యాయులు, గ్రామ యువకులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -