Tuesday, June 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నూతన పంచాయతీ కార్యదర్శికి సన్మానం

నూతన పంచాయతీ కార్యదర్శికి సన్మానం

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ నూతన పంచాయతీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన వినోద్ ను మంగళవారం సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఇటీవల జరిగిన పంచాయతీ కార్యదర్శుల బదిలీల్లో  ఇప్పటివరకు పంచాయతీ కార్యదర్శిగా కొనసాగిన గంగా జమున వేల్పూర్ గ్రామపంచాయతీ కార్యదర్శిగా బదిలీపై వెళ్లారు. ఆమె స్థానంలో వేల్పూర్ నుండి బదిలిపై విచ్చేసిన వినోద్ బాధ్యతలను స్వీకరించారు. ఈ నేపథ్యంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కార్యదర్శులు సర్పంచ్ కొత్తపల్లి హారిక, ఉప సర్పంచ్ కొత్తపల్లి అశోక్ మర్యాదపూర్వకంగా కలిసి పంచాయతీ పాలకవర్గం తరఫున పూలమాల, శాలువాతో ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన కార్యదర్శి వినోద్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి ప్రజలు తమ వంతుగా సహకారం అందించాలని కోరారు. ఇంటి పన్నులు సకాలంలో చెల్లించడం ద్వారా గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు తోడ్పాటు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ పాలకవర్గం సభ్యులు మాధవేణి లావణ్య, జెడి బాలకృష్ణ, బోల్గం నవీన్ గౌడ్, లోలం సురేష్, సున్నం కవిత, పీర్ల అనూష మామిడి లక్ష్మి, శివసారం లక్ష్మి, వేములవాడ జగదీష్, గుర్రం జామున కాలూరి మహేందర్, మామిడి అక్షయ్, గ్రామ పంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -