Tuesday, June 2, 2026
E-PAPER
Homeఖమ్మంఆయిల్ ఫెడ్ డీఓతో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ డిప్యూటీ మేనేజర్ సమావేశం

ఆయిల్ ఫెడ్ డీఓతో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ డిప్యూటీ మేనేజర్ సమావేశం

- Advertisement -

– ఆయిల్ ఫాం సాగులో నూతన సంస్కరణలు
– డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ తో ఆయిల్ ఫెడ్ సంయుక్త కార్యాచరణ 
– నేల సారం, మొక్కల ఆరోగ్యానికి ఆయిల్ ఫెడ్ కంకణం
– డీఓ శంకర్ తో సమావేశం అయిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ డీఎం వీరాస్వామి 
నవతెలంగాణ – అశ్వారావుపేట

ఆయిల్ ఫాం క్షేత్రాల్లో నేల సారం పెంపుదల, మొక్కల ఆరోగ్య పరిరక్షణకు నూతన సాంకేతిక పద్ధతులను రైతులకు చేరవేసే లక్ష్యంతో ఆయిల్ ఫెడ్ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ప్రముఖ సంస్థ రెడ్డీస్ ల్యాబ్స్‌తో సంయుక్తంగా కార్యాచరణను అమలు చేయనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా క్షేత్ర స్థాయి సిబ్బందికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, నేల పరీక్షలు, ఆకుల విశ్లేషణ, పోషక నిర్వహణ, జీవ ఎరువుల వినియోగం, దిగుబడి పెంపు చర్యలపై శిక్షణ అందించనున్నారు.

ఈ సందర్భంగా ఆయిల్ ఫెడ్ జిల్లా అధికారి (డీఓ) శంకర్‌తో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ తెలంగాణ డిప్యూటీ మేనేజర్ ఆర్.వీరాస్వామి మంగళవారం సమావేశమై కార్యాచరణ ప్రణాళికపై సమాలోచనలు జరిపారు. అనంతరం ఆయిల్ ఫాం తోటలను సందర్శించి, మొక్కల పెరుగుదల, నేల పరిస్థితులు, పోషక నిర్వహణ అంశాలను పరిశీలించారు.

రైతులకు శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులను అందుబాటులోకి తీసుకువచ్చి, ఆయిల్ ఫాం సాగును మరింత లాభదాయకంగా మార్చడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయిల్ ఫెడ్ సిబ్బంది, వ్యవసాయ నిపుణులు, రెడ్డీస్ ల్యాబ్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -