Saturday, February 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సబ్సిడీపై వ్యవసాయ యంత్ర పరికరాలు అందజేత..

సబ్సిడీపై వ్యవసాయ యంత్ర పరికరాలు అందజేత..

- Advertisement -

జిల్లా ఉద్యాన శాఖ అధికారి..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్  

ఉద్యాన శాఖ ఆద్వర్యంలో ఈ ఆర్దిక సం. 2025-26 గాను  అమలు పరుస్తున్న ఎం ఐ డి హెచ్ పథకంలో ఉద్యాన యాంత్రికరణ విభాగంలో పవర్ టిల్లర్స్, పవర్ వీడర్స్, బ్రష్ కట్టర్స్, స్ప్రెయర్స్, మిని ట్రాక్టర్లను 40 నుంచి 50 శాతం సబ్సిడీ పై రైతులకు సరఫరా చేయుటకు అందుబాటులో ఉన్నాయని ఉద్యాన శాఖ అధికారి తెలిపారు. పవర్ టిల్లర్స్ .. ఎస్టి- 01 , ఇతర పెద్ద రైతులు (5 ఎకరాలకు మించి) – 03, పవర్ వీడర్స్ జనరల్ – 01 (చిన్న సన్న కారు రైతులు ), ఎస్సీ   – 02 ., ఇతర పెద్ద రైతులు (5 ఎకరాలకు మించి) – 03, బ్రష్ కట్టర్ – జనరల్ – 04 (చిన్న సన్న కారు రైతులు ), ఎస్సీ – 05., ఎస్టి – 04, ఇతర పెద్ద రైతులు (5 ఎకరాలకు మించి ) – 05, పవర్ / నాప్సాక్ స్ప్రెయర్స్ జనరల్ – 02(చిన్న సన్న కారు రైతులు ), ఎస్సీ – 04., ఇతర పెద్ద రైతులు (5 ఎకరాలకు మించి) – 12, మిని ట్రాక్టర్లు.. – 01 . (చిన్న సన్న కారు రైతులు ), ఎస్సీ – 01 ., ఎస్టి – 01, ఇతర పెద్ద రైతులు (5 ఎకరాలకు మించి ) – 01 జిల్లా కి కేటాయించిన లక్ష్యం తక్కువగా ఉన్నందున మొదట సంప్రదించిన రైతులకు ప్రాధాన్యత ఇవ్వబడును. ఆసక్తి గల రైతులు పూర్తి వివరాల కొరకు ఫిబ్రవరి 10  తేది లోపల సంబంధిత  ఉద్యాన అధికారిని  సంప్రదించి  దరఖాస్తును సమర్పించగలరు. 

చౌటుప్పల్, బొమ్మలరామారం, వలిగొండ, రామన్నపేట, నారాయణపూర్, పోచంపల్లి, అడ్డగుడూర్, మోత్కూర్ మండల రైతులు సంప్రదించవలసిన నెంబర్  8977714175,  ఉద్యాన అధికారి కె కవిత, ఆత్మకూర్, గుండాల, మోటకొండూరు, ఆలేరు, రాజాపేట, తుర్కపల్లి, బీబీనగర్ మండల రైతులు సంప్రదించవలసిన నెంబర్ – 8977714176, కె. స్రవంతి ఉద్యాన అధికారి, భువనగిరి, యాదగిరిగుట్ట  మండల రైతులు సంప్రదించవలసిన నెంబర్ -8977714191, జి. స్నేహిత ఉద్యాన అధికారులను సంప్రదించాలని కోరారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -