Tuesday, June 2, 2026
E-PAPER
Homeజాతీయంఏంటి బ్రో? ఏమవుతోంది బ్రో?.. సీఎం విజ‌య్‌పై డీఎంకే వ్యంగ్యాస్త్రాలు

ఏంటి బ్రో? ఏమవుతోంది బ్రో?.. సీఎం విజ‌య్‌పై డీఎంకే వ్యంగ్యాస్త్రాలు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఇటీవ‌ల త‌మిళ‌నాడు సీఎం విజ‌య్ కేంద్ర‌మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామ‌న్‌ల‌ను క‌లిశారు. తాజాగా టీవీకే అధినేత‌ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌పై డీఎంకే డీప్యూటీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ ఏ. రాజా సెటైర్లు వేశారు. వాట్ బ్రో, ఏం జ‌రుగుతుంద‌ని మీడియా స‌మావేశంలో ఎద్దేవా చేశారు. ఢిల్లీకి వెళ్లి కేవ‌లం వాళ్ల‌ల‌నే క‌లువ‌డంలో అంతర్య‌మేంట‌ని, ఇత‌ర కేంద్ర‌మంత్రుల‌ను ఎందుకు క‌లువ‌లేద‌ని ప్ర‌శ్నించారు. ఆరు నెల‌ల వ‌ర‌కు విజ‌య్ ప్ర‌భుత్వంపై తాము విమ‌ర్శ‌లు చేయ‌బోమ‌ని త‌మ అధినేత ఎంకే స్టాలిన్ చెప్పార‌ని గుర్తు తెలియ‌జేశారు. కానీ విజ‌య్ చ‌ర్య‌లు త‌మిళ‌నాడు ప్ర‌జ‌ల‌కు విరుద్ధంగా ఉన్నాయ‌ని పేర్కొన్నారు. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ముగియ‌గానే మీడియా స‌మావేశం ఎందుకు నిర్వ‌హించలేద‌ని మండిప‌డ్డారు.

“అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ లేవనెత్తిన ప్రశ్నలకు విజయ్ ఎందుకు సమాధానం చెప్పలేకపోయారు?” అని ఆయన ప్రశ్నించారు. “ఏంటి బ్రో? ఏమవుతోంది బ్రో? ఇదంతా ఎందుకు చేస్తున్నావ్ బ్రో. “మీరు మాకు గౌరవం ఇస్తే, మేము తిరిగి గౌరవం ఇస్తాము. మేము అగౌరవకరమైన భాషను ఉపయోగించము,” అని ఆయన చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -